Friday, April 26, 2024

ప్రచారం ముగిసినా.. సోషల్ మీడియా వదలని అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

MLC Candidates Campaigning on social media

గంట గంటకు ఓటర్లకు మెసేజ్, వాయిస్ కాల్స్ చేస్తున్న అనుచరులు
అభ్యర్దుల నూతన పోకడలు చూసి బిత్తరపోతున్న ఓటర్లు
గెలుపు కోసం ఎంతటికైనా దిగుజారుతారని ప్రభుత్వ ఉద్యోగుల వెల్లడి

హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నేడు పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ జరగునుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆయా పార్టీల అభ్యర్థులు సిద్దం చేసుకున్నారు. ఓటర్లను బూత్‌ల వద్దకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు సిద్దం చేసుకుని ఓటు వేయించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఈనెల 12 సాయంత్రం ముగిసిన అభ్యర్థులు మాత్రం సోషల్ మీడియా వేదిక ప్రచారం ఉదృత్తం చేశారు. 50మంది ఓటర్లకు ఒక వాటాప్స్ గ్రూపు పెట్టి ఎప్పటికప్పడు మెసేజ్, వాయిస్ కాల్ పంపిస్తూ మద్దతు పలికేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శనివారం బహిరంగ ప్రచారం లేకపోవడంతో అభ్యర్థుల అనుచరులు సెల్‌ఫోన్‌తో ప్రచారం చేస్తున్నారు.

కుల, నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల్లోని ముఖ్యనాయకులు ఫోన్ చేస్తూ, మిగతవారికి వాటాప్స్ గ్రూపు ద్వారా తమను ఆదరించాలని పేర్కొంటూ తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో ఉండి పోరాటం చేశానని, ఉద్యమకారులకే పట్టభద్రులు పట్టం కట్టాలని సూక్తులు వల్లిస్తున్నారు. వారు గతంలో చేసిన ఉద్యమాలకు సంబందించిన ఫోటో క్లిప్పులు తాను సమాజం కోసం సేవలను వివరిస్తున్నారు. తనను గెలిపిస్తే భవిష్యత్తులో చేపట్టబోయే పనులు వివరిస్తూ మండలిలో అడుగు పెట్టేలా చూడాలని వేడుకుంటున్నారు. ఎప్పడు లేనివిధంగా ఈసారి జరిగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానంలో 93మంది అభ్యర్దులు బరిలో ఉండటంతో గెలుపు అనుకుంత సులభంకాదని భావిస్తూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్రచారం కోసం యువకులను ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్దిగా మాజీ ప్రధాని పివి కూతురు సురభివాణిదేవి, కాంగ్రెస్ తరుపున చిన్నారెడ్డి, బిజెపి నుంచి రాంచందర్‌రావు, టిడిపి పార్టీ తరుపున ఎల్.రమణ, స్వతంత్ర అభ్యర్దులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, ప్రైవేటు కళాశాల అధ్యక్షులు గౌరీ సతీష్ తలపడుతున్నారు.

వీరంతా నామినేషన్ల ఉపసంహరణ మరుసటి రోజు శుక్రవారం ప్రచారం అట్టహాసంగా నిర్వహించారు. అధికార పార్టీ తరుపున మంత్రులు తలసాని, మహమూద్ అలీ, గంగులు కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు బాధ్యతలు తీసుకుని వాణిదేవి గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు. అయిన ఓటర్లను ఇతర అభ్యర్దుల ట్రప్‌లో పడకుండా సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నారు. పోలింగ్ చివరి ఆఖరి గంటవరకు తమదైన శైలిలో ప్రచారం చేసేందుకు తగిన ప్రణాళికలు చేసినట్లు అభ్యర్థుల అనుచరులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన అభ్యర్థుల సామాజిక మాధ్యమాల ప్రచారానికి ఓటర్లు బిత్తరపోతున్నారు. రోజుకు ఒక అభ్యర్థి నాలుగైదు మెసేజ్‌లు, వాయిస్‌కాల్ చేయడంతో విసిగిపోతున్నామని వెల్లడిస్తున్నారు. పోటీ పడి సెల్‌పోన్ ద్వారా సమాచారం పంపుతూ గెలుపు కోసం కొంతమంది ఏకంగా నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నగదు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు చెబుతున్నారు. సాదారణ ఎన్నికలకంటే రెండింతలు ప్రచారం, డబ్బు ఖర్చు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News