Monday, May 6, 2024

రైతులకు రూ.50వేల నష్ట పరిహారం ఇవ్వాలి: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు జరిగిన ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. “గోదావరి పరివాహక ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగింది. వరదల వల్ల 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట పొలాల్లో ఇసుక మేటలతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.

నష్టపోయిన రైతులకు రూ.15 నుంచి రూ.20వేల పరిహారం ఇస్తే సరిపోదు. కనీసం రూ.50వేల వరకు పరిహారం ఇవ్వాలి. వరదలతో దెబ్బతిన్న చెరువులు కుంటలు, కాల్వలకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. వరదలతో మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోయారు.రూ.కోట్ల సంపదను కోల్పోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. భారీ వరదలతో కడెం ప్రాజెక్టు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగించింది. కడెం ప్రాజెక్టుకు అదనపు గేట్లు ఏర్పాటు చేయాలి” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News