Saturday, May 4, 2024

అమ్మలోని మొదటి అక్షరం ‘అ’.. నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’..

- Advertisement -
- Advertisement -

అమ్మలోని మొదటి అక్షరం ‘అ’.. నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’.. : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఎమోషనల్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక. తమ సోదరులకు తోబుట్టువులు రాఖీ కట్టి ఈ అనుబంధం కలకాలం కొనసాగాలని కోరుకుంటారు. ఒకరికొకరు ఆశీర్వాదం తీసుకుంటారు. అంతటి ప్రత్యేకమైన రాఖీ పండుగ రోజు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత ఎమోషనల్ ట్వీట్ చేశారు. అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’ అంటూ మంత్రి కెటిఆర్‌తో ఉన్న ఫొటోను ఎంఎల్‌సి కవిత ట్వీట్ చేశారు. ఇక మంత్రి కెటిఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రాఖీ పండుగ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు ఎంఎల్‌సి కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలిసి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎంఎల్‌సి కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్ ట్విట్టర్ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. అన్నాచెల్లెళ్ల్ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు.

Also Read: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు రాఖీ కట్టిన సోదరి శ్రీదేవి…….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News