Saturday, May 4, 2024

మీ తీరు పార్లమెంటుకు అవమానం

- Advertisement -
- Advertisement -

Modi angry over opposition MPs' behavior

ప్రతిపక్ష ఎంపిలప్రవర్తనపై ప్రధాని మోడీ ఆగ్రహం

న్యూఢిల్లీ: పార్లమెంటులో విపక్షాల తీరు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ప్రవర్త పార్లమెంటును అవమానించే విధంగా ఉందని ఆయన అన్నారు. మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష సభ్యుల తీరును తప్పుబట్టారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వాయిదా తీర్మానలు ఇస్తూ, నినాదాలతో సభా కార్యకలాపాలకు ప్రతిపక్షాలు అడ్డుతగుతున్నాయని, ఇది పార్లమెంటుకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రజలకు అవమానమని అన్నారు. రెండు సభల్లోను విపక్ష ఎంపిలు అభ్యంతరకర రీతిలో ప్రవర్తిస్తున్నారని, ఓ ఎంపి మంత్రి చేతిలో పేపర్లు లాక్కుని, ఆ పేపర్లను ముక్కలు చేసి సభలో విసిరేసిన తీరును ప్రధాని తప్పుబట్టారు. ఇటీవల పెగాసస్ వ్యవహారంపై మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతంగా తృణమూల్ ఎంపి శంతను సేన్ ఆయన చేతిలోంచి పేపర్లు లాక్కుని చించేసిన విషయం తెలిసిందే.

పార్లమెంటులో బిల్లులు పొందుతున్న తీరుపై టిఎంసి ఎంపి డెరిక్ బ్రియాన్ చేసివాఖ్యలను కూడా ప్రధాని తప్పుబట్టారు.‘ తొలి పది రోజుల్లో మోడీషాలు హడావుడిగా 12 బిల్లులను సగటున ఒక్కో బిల్లుకు ఏడు నిమిషాలకన్నా తక్కువ సమయంలో ఆమోదించుకున్నారు. బిల్లులను ఆమోదిస్తున్నారా లేక పాపిడీ చాట్ చేస్తున్నారా?’ అని ఒబ్రియాన్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నట్లు ప్రధాని తమ పార్టీ ఎంపిలతో అన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ విలేఖరులకు చెప్పారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదని సమావేశంలో ప్రధాని స్పష్టం చేశారు. బిల్లులు ప్రభుత్వానికి చెందినవి కావని, ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించినవని ఆయన అన్నారు. నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని ప్రధాని మరోసారి స్పష్టం చేసినట్లు జోషీ చెప్పారు. వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో అఖిల భారత కోటాలో ఒబిసిలు, ఇడబ్లుస్‌లకు రిజర్వేషన్లు కల్పించినందుకు సమావేశం ప్రధానిని ప్రశంసించింది. జూలై నెలలో జిఎస్‌టి వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.16 లక్షల కోట్లకు చేరడం దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసానికి నిదర్శనమని కూడా మోడీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News