Monday, April 29, 2024

మోడీ ర్యాలీ పేలుళ్ల కేసులో.. నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవితఖైదు

- Advertisement -
- Advertisement -

Modi rally blasts case: Four sentenced to death

9మంది దోషులకు శిక్షలు ఖరారు చేసిన ఎన్‌ఐఎ కోర్టు

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో 2013లో నిర్వహించిన ఓ ర్యాలీ సందర్భంగా జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషులకు జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు శిక్షల్ని ఖరారు చేసింది. ఈ కేసులో నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవితఖైదు, ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, ఒకరికి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఎన్‌ఐఎ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోడీ ఆ ర్యాలీలో ప్రసంగించాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ కేసులో మొత్తం 11మందిపై విచారణ జరిపిన కోర్టు 9 మందిని దోషులుగా తేలుస్తూ అక్టోబర్ 27న తీర్పు వెల్లడించింది. ఇప్పుడు శిక్షల్ని ఖరారు చేసింది. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో అతడి కేసును జువైనల్ కోర్టుకు బదిలీ చేసింది. మరొకరిని నిర్దోషిగా ప్రకటించింది.

2013లో బిజెపి ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ఆ పార్టీ ప్రకటించింది. ఆ సమయంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో 2013 అక్టోబర్ 27న హుంకార్ పేరుతో చేపట్టిన ర్యాలీలో ప్రధాని అభ్యర్థిగా మోడీ పాల్గొన్నారు. మోడీ ప్రసంగించే వేదికకు 150 మీటర్ల దూరంలో వరుసగా ఆరు బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ ఘటనలో ఆరుగురు చనిపోగా, 85మంది గాయపడ్డారు. ఆ సమయానికి మోడీ, ఇతర ముఖ్య నేతలెవరూ సభావేదిక వద్దకు చేరుకోలేదు. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఎ చేపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News