Thursday, May 16, 2024

భారత్‌లో బిలియనీర్లు ఎక్కువే..

- Advertisement -
- Advertisement -

ప్రపంచం జాబితాలో మనది మూడో స్థానం
2021లో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 13,637కు పెరిగింది
గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి
మొదటి స్థానంలో అమెరికా, ఆ తర్వాత చైనా

More billionaires in India
న్యూఢిల్లీ : భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 2021 సంవత్సరంలో భారీగా పెరిగింది. హెచ్‌ఎన్‌ఐ (అత్యధిక నికర విలువ కల్గిన వ్యక్తిగత సంపన్నుల) సంఖ్య పెరగడమే కాదు, వారి సంపద గతేడాది(2021)లో రూ.226 కోట్లు (30 మిలియన్ డాలర్లు) పెరిగింది. ఈక్విటీ మార్కెట్లు, డిజిటల్ విప్లవం కారణంగా గతేడాదిలో వ్యక్తిగత సంపన్నుల సంఖ్య పెరిగిందని నైట్ ఫ్రాంక్ నివేదిత తెలిపింది. 2021లో ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల జనాభాలో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా 748 మంది బిలియనీర్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో చైనా (554) ఉంది. మూడో ర్యాంక్‌లో ఇండియా బిలియనీర్ల సంఖ్య 145గా ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తాజా ఎడిషన్ వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం, 2021 సంవత్సరంలో యుహెచ్‌ఎన్‌డబ్లుఐ(అత్యధిక నికర విలువ కల్గిన వ్యక్తిగత సంపన్నులు) సంఖ్య 6,10,569కు పెరగ్గా, 2020లో ఈ సంఖ్య 5,58,828గా ఉంది. అంటే గ్లోబల్‌గా 9.3 శాతం పెరిగింది. భారత్‌లో బిలియనీర్లు గతేడాది రూ.226 కోట్ల సంపదను పెంచుకున్నారని, వార్షికంగా 11 శాతం వృద్ధి ఉందని నివేదిక వెల్లడించింది. 2021లో భారత్‌లో యుహెచ్‌ఎన్‌డబ్లుఐ సంఖ్య 13,637కు పెరగ్గా, అంతకుముందు 2020లో ఈ సంఖ్య 12,287గా ఉంది. అంటే ఒక్క ఏడాదిలోనే వీరి సంఖ్య 11 శాతం పెరిగింది.

బెంగళూరు ఫస్ట్..

దేశీయ నగరాల్లో చూస్తే బెంగళూరులోనే ఎక్కువగా యుహెచ్‌ఎన్‌డబ్లుఐల సంఖ్య ఉంది. ఈ నగరంలో సంపన్నులు 352 మందితో 17.1 శాతం పెరిగారు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీలో 210 సంఖ్యతో 12.4 శాతం వృద్ధి, ముంబై 1,596తో 9 శాతం వృద్ధి ఉందని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. 2016లో దేశంలో ఈ సంఖ్య 7,401 ఉండగా, 2021లో 13,637కు పెరిగింది. అయితే 2026 నాటికి ఈ సంఖ్య 19,006కు అంటే 39 శాతం పెరగనుందని అంచనా వేస్తున్నారు. నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ, ఈక్విటీ మార్కెట్లు, డిజిటల్ పరంగా వచ్చిన మార్పులతో భారత్‌లో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. భారత్‌లో యువతలో వృద్ధి, స్వయంగా హెచ్‌ఎన్‌ఐలుగా ఎదిగిన వారు ఎక్కువగా ఉన్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News