Friday, May 10, 2024

పెరుగుతున్న ఎండలు…

- Advertisement -
- Advertisement -

52 మిలియన్ యూనిట్లుకు చేరుకున్న విద్యుత్ డిమాండ్
ఈ సంవత్సరం 80 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం
డిమాండ్‌కు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

More power used in Summer
మనతెలంగాణ, సిటీబ్యూరో: రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతోంది. గత కొద్ది రోజులుగా గమనిస్తే నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదు అవుతూ వస్తోంది. దీంతో నగర వాసులు ఎండల తీవ్రతను తట్టుకునేందుకు అనేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లును చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం అధికం అవుతుండటంతో దాని ప్రభావం విద్యుత్ పై పడుతోంది.పెద్ద మొత్తంలో చల్లదనాన్ని అందించే విద్యుత్ పరికరాలను వాడుతుండటంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది.ప్రస్తుత విద్యుత్ డిమాండ్ రోజుకు 5ం నుంచి 56 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ సంవత్సరం ఇదే విధంగా అధిక మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదయితే 70 నుంచి 80 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత సంవత్రం గ్రేటర్ వ్యాప్తంగా ఇదే సమయానికి 2200 మెగావాట్లు ఉండగా అది ఇప్పుడు 2578 మెగావాట్లకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ ముఖ్యంగా మద్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల మధ్య అధికంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు 2246 మెగా వాట్లు ఉండగా అది మంగళవారం ఇదే (2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య 2398 మెగావాట్లకు పెరిగినట్లు చెబుతున్నారు.

భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సర్కిళ్ళ వారీగా విద్యుత్ లైన్ల పునరుద్దరణ చర్యలు అధికారులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.ఒత్తిడిని తట్టుకునేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిట్లు చెబుతున్నారు. నగరంలోని 9 సర్కిళ్ళలో సుమారు 52 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.ఈ వేసవిలో వీటి అవసరాలు తీరాలంటే రొజుకు సగటున 70 మిలియన్ యూనిట్లకు పైగా వసరం. రాబోయే ఒత్తిడి తట్టుకుంటూ ఫీడర్లు ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా నిరంతరాయంగా విద్యుత్ సరపరా చేయాలంటే డిస్టిబ్యూషన్ వ్యవస్థను మెరుగు పరుస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా అదనపు ట్రాన్స్‌ఫార్లర్ల, పీడర్లు, పునరుద్దరణ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలనరికి వేత ఆయిల్ లీకేజిలను అరికట్టడం వంటి పనుల పెద్ద మొత్తంలో నిధులు కూడా విడుదల చేసినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన సగానికి పైగా పనులు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన పనులు త్వరలో పూర్తి చేసి విద్యుత్ సరపరాలో అతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. ఇప్పటికే లైన్ల పునరుద్దరణ పనులు 90 శాతం పూర్తి అయిటన్లు తెలిపారు.. కోతలకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారం కోసం కోసం ప్యూజ్ ఆఫ్ కాల్ (1912) మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. కంట్రోల్ రూమ్‌తో పాటు సంబంధిత ఏడీ, ఏడీఈ,డీఈ, ఎస్‌ఈలకు ఫిర్యాదులు చేరుతాయి. తద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని చేస్తామంటున్నారు. ఉద్యోగుల్లో జవాబుదారి తనం పెంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాన్నామని ,నిత్యం వినియోగ దారులకు అందుబాటులో ఉండాల్సిందిగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

గత వారం రోజులుగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ః
తేదీ వారం విద్యుత్ డిమాండ్(ఎంయు)
16..02..22 బుధవారం 50.35
17..02..22 గురువారం 50.22
18..02..22 శుక్రవారం 51.04
19..02.022 శనివారం 49.96.
20..02..22 ఆదివారం 47.14
21..02..22 సోమవారం 51.98

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News