Saturday, April 27, 2024

బిసి హాస్టల్ విద్యార్థుల ధర్నా, ముట్టడి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంపుతో పాటు పిజి, డిగ్రీ కోర్సులు చదివే బిసి విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని జిల్లా బిసి కార్యాలయాన్ని ముట్టడించారు. పెరిగిన ధరల ప్రకారం ఛార్జీలు పెంచాలని -ఉద్యోగులు జీతాలు పెంచుతారు.- మా స్కాలర్ షిప్ పెంచరా ? అంటూ నినాదాలు ఇచ్చారు. వందలాది మందితో జరిగిన ఈ మహాధర్నా రాష్ట్ర బిసి యువజన సంఘం అద్యక్షులు నీల వెంకటేష్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు పూటకు పది రూపాయలకు భోజనం సాధ్యమా ! ఆయన ప్రశ్నించారు. పెరిగిన ధరల ప్రకారం 8 లక్షల మంది యూనివర్సిటి, – గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌లో బిసి సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద ఎత్తున్న నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు సి.రాజేందర్, కృష్ణయాదవ్, అనంతయ్య, గజేందర్, తిరుపతి, నికిల్, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News