Friday, April 26, 2024

మయన్మార్‌లో మారణహోమం.. 30 మందికి పైగా కాల్చివేత

- Advertisement -
- Advertisement -

More than 30 villagers killed in Myanmar

బ్యాంకాక్ : శరణార్ధుల శిబిరాలకు వెళ్తున్న మహిళలు, చిన్నపిల్లలు సహా 30 మందిని మయన్మార్ సైన్యం కాల్చి చంపింది. అనంతరం ఆ మృతదేహాలకు నిప్పు పెట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కయాహ్ రాష్ట్రం లోని మోసో గ్రామం సమీపంలో ఈ ఘటన సంభవించినట్టు భావిస్తున్నారు. మోసో గ్రామం పక్కనే ఉన్న కియోగాన్ గ్రామం సమీపంలో శుక్రవారం సాయుధ ప్రతిఘటన బలగాలకు , మయన్మార్ సైన్యానికి మధ్య పోరాటం జరుగుతుండగా, శరణార్ధులు శిబిరాలకు పారి పోయారని, ఓ గ్రామస్థుడు చెప్పారు. ఈ క్రమంలో వారిని ప్రభుత్వ బలగాలు అరెస్టు చేసి కాల్చి చంపాయని, అనంతరం మృతదేహాలకు నిప్పు పెట్టాయని తెలిపారు. గుర్తించేందుకు సైతం వీలు లేనంతగా మృతదేహాలు కాలిపోయాయని, ఆ ప్రాంతంలో మహిళలు, చిన్నపిల్లల దుస్తులు, ఆహారం, ఔషధాలు కనిపించాయని చెప్పారు. మృతదేహాలను తాళ్లతో కట్టేసి, అనంతరం వాహనాల్లో పడేసి నిప్పు పెట్టారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News