Wednesday, May 22, 2024

‘ఈ మ్యారీడ్ లైఫ్’… అయ్యయ్యోయ్యో

- Advertisement -
- Advertisement -

Most Eligible Bachelor Movie Pre Teaser Released
యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్2 బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ లిరికల్ సాంగ్ విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. “హాయ్ ఐ యామ్ హర్ష.. ఒక అబ్బాయి లైఫ్‌లో 50 పర్సెంట్ కెరీర్.. 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. కెరీర్‌ని సూపర్‌గా సెట్ చేశా.. కానీ ఈ మ్యారీడ్ లైఫ్.. అయ్యయ్యోయ్యో..” అని అఖిల్ ప్రీ టీజర్‌లో చెబుతాడు. హర్ష తన కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు.. కానీ అతను తన మ్యారీడ్ లైఫ్ గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడనేది తెలియాలంటే అక్టోబర్ 25 ఉదయం 11:40 గంటల వరకు వేచి చూడమని చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తం మీద ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ టీజర్.. పూర్తి టీజర్ ని చూడాలనే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఈ మూవీలో బొమ్మరిల్లు భాస్కర్ గత చిత్రాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందని తెలిసింది. ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని 2021 సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Most Eligible Bachelor Movie Pre Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News