Sunday, May 5, 2024

కలర్‌ఫుల్ దీపావళి

- Advertisement -
- Advertisement -

Most Eligible Bachelor poster release

 

అఖిల్ అక్కినేని ఈమధ్యే “మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు”అని అడుగుతూ టీజర్‌తో అందరి అంచనాలను అందుకునేలా చేశాడు. ఇప్పుడు దీపావళికి చిచ్చుబుడ్డిని పూజాతో వెలిగించేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసువర్మ కలిసి నిర్మిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ తెలిసేలా ఈ దీపావళికి కలర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా రానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News