Monday, April 29, 2024

స్పెషల్ సర్‌ప్రైజ్

- Advertisement -
- Advertisement -

RRR movie Diwali surprise gift

 

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే. చాలా కారణాలతో సినిమా విడుదల వాయిదాపడింది. సంక్రాంతికి ప్లాన్ చేశారు కానీ కరోనా వచ్చి పడింది. సమ్మర్‌లో కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. అసలు 2021లో ఈ సినిమా విడుదలవుతుందా? లేదా? అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ అటు సినీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ జరుగుతోంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ నుంచి దీపావళి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. పండుగ సందర్భంగా సినిమా టీమ్ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. వాటిల్లో ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా కనిపించారు. ఈ ఫోటోల్లో ఈ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చారు. ఈ స్టిల్స్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇక ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని చిత్రబృందం కోరుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News