Monday, April 29, 2024

సిరీస్‌ను సాఫీగా నిర్వహిస్తాం

- Advertisement -
- Advertisement -

Australia says We run the series smoothly

 

సిడ్నీ : భారత్‌తో జరిగే సిరీస్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. సుదీర్ఘ కాలం పాటు సాగే సిరీస్‌ను బయోబబూల్ వాతావరణంలో పకడ్బంధీగా నిర్వహిస్తామని ఆస్ట్రేలియా క్రికె ట్ బోర్డుకు చెందిన ఓ అధికారి వివరించాడు. సిరీస్ లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు ట్వంటీ 20లు మరో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక సిరీస్ కోసం దుబాయి నుంచి ప్రత్యేక విమానం లో భారత బృందం గురువారం ఆస్ట్రేలియా చేరుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా టీమిండియా క్రికెటర్ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కరోనా బయటపడిన తర్వాత ప్రపంచ క్రికెట్‌లో జరుగుతున్న అతి పెద్ద సిరీస్ ఇదే కావడంతో దీన్ని జయప్రదంగా నిర్వహించేందుకు బోర్డు అన్ని చర్యలు తీసుకొంటోంది. సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న అన్ని స్టేడియాలను బయోబబూల్‌లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలావుండగా రెండు నెలల పాటు సాగే సిరీస్‌లో భారత ఆటగాళ్లు ఎలాంటి ఆందోళన లేకుండా ఉండొచ్చని, క్రికెటర్ల ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని బోర్డు హామీ ఇచ్చింది. గతంతో పోల్చితే ఈసారి భిన్న పరిస్థితుల్లో సిరీస్ జరుగనుందని, అయినా ఎవరూ కూడా ఎలాం టి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ సిరీస్ జయప్రదంగా నిర్వహించడమే తమ ఏకైక లక్షమని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నా రు. మరోవైపు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత క్రికెటర్లు క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో వీరు గడుపుతున్నారు. ఆటగాళ్ల ఆరోగ్యానికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వైద్యు లు 24 గంటల పాటు భారత క్రికెటర్లకు అందుబాటు లో ఉండనున్నారు. వీరి సలహాలు, సూచనలు పాటి స్తూ క్రికెటర్లు త్వరలోనే ప్రాక్టీస్‌ను ఆరంభించే అవకాశాలున్నాయి. అయితే దీని కోసం కొన్ని రోజుల పాటు వేచిచూడాల్సిన అవసరం ఉంది. ఇదిలావుండగా క్వారంటైన్ ముగిసిన తర్వాతే ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నెగెటివ్ వచ్చిన వారికే సిరీస్‌లో ఆడే అవకాశం కల్పిస్తారు.

ప్రేక్షకులకు అనుమతి..

భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో యాభై శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాల ని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. కోవిడ్ భయం నేపథ్యంలో పూర్తిస్థాయి లో అభిమానులకు స్టేడియాల్లో అనుమతించడం లేదని అధికారులు తెలిపా రు. ఆడిలైడ్ వేదికగా జరిగే చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్‌లో స్టేడియం సామర్థంలో సగం మందికి మ్యాచ్ చూసే అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా పలు జాగ్రత్తలను కూడా తీసుకోనున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి స్టేడియంలోకి ప్రవేశం కల్పిస్తారు. ఇక గతంతో పోల్చితే ఈసారి పలు కఠిన నియమాలను అమలు చేయనున్నారు. స్టేడియాలకు వచ్చే అభిమానులను పూర్తిగా పరీక్షించి ఎలాంటి జ్వరం కానీ, ఇతర ఆరోగ్య సమస్యలేదని నిర్ధారించుకున్నాకే లోపలకి ప్రవేశం కల్పిస్తారు. పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ స్టేడియాల్లో తొలిసారి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ టెస్టు సిరీస్ ద్వారా అభిమానులకు మళ్లీ ప్రత్యక్షంగా మ్యాచ్‌లను చూసే అవకాశం కలుగనుంది. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News