Sunday, April 28, 2024

అత్యాచారానికి గురైన బాలిక గర్భ విఛ్ఛితికి కోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

జబల్పూర్ : అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాలిక కేసులో మధ్యప్రదేశ్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఆమె గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. సాగర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక 2023 అక్టోబర్ 23న అత్యాచారానికి గురైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆమె తండ్రి ఈ విషయం తెలుసుకుని నిందితుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ప్రకారం నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుడిని పోలీస్‌లు అరెస్ట్ చేసి మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రవేశ పెట్టారు. అప్పటికే బాలిక 8 వారాల గర్భవతి అని నిర్ధారణ అయింది. చిన్నతనంలోనే గర్భం రావడం, ఆమె తన కాళ్లపై తాను నిలబడలేని పరిస్థితి రాకుండా ఉండేందుకు గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

దీనిపై విచారించిన కోర్టు గర్భవిచ్ఛిత్తికి అనుమతించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ జీఎన్ ఆహ్లూవాలియా ధర్మాసనం విచారించింది. అంతకు ముందు బాధితురాలి తండ్రి జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ఆమె అత్యాచారానికి గురైందని అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ నిందితుడు అత్యాచారం చేయలేదని , తనకు తాను మేజర్‌గా బాలిక అంగీకరిస్తే ట్రయల్ కోర్టు తన నివేదికను ప్రాసిక్యూటిక్స్ డిపాజిషన్ షీట్‌తో పాటు కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ముందు సమర్పించాలని ఆదేశిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

విచారణ అధికారి అఫిడవిట్ ధృవీకరించబడిన కాపీని పొందాక, దానిని కేసు డైరీలో ఉంచాలి. ఆ తరువాత దానిని మెడికల్ బోర్డు ముందు సమర్పించాలి. అప్పుడే బోర్డు గర్భవిఛ్చితికి అనుమతిస్తుందని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది. బాలిక తండ్రి పిటిషన్ మేరకు కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News