Wednesday, May 1, 2024

ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదా కోల్పోయిన ముకేశ్

- Advertisement -
- Advertisement -

Mukesh Ambani

 

మొదటి స్థానానికి ఎగబాకిన అలీబాబా జాక్ మా
చమురు సంక్షోభంతో రిలయన్స్ షేరు 12 శాతం డౌన్
కరిగిపోయిన ముకేశ్ సంపద విలువ

న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత ధనవంతుడనే ట్యాగ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కోల్పోయారు. ఎందుకంటే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోవడంతో ఆయన సంపద కరిగిపోతోంది. సోమవారం మార్కెట్లు కుప్పకూలడంతో ఆయన కంపెనీల షేర్ల విలువ భారీగా పతనమైంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మొదటి స్థానంలో ఉన్న అంబానీని ఇకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్‌మా వెనక్కినెట్టారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో వ్యాపారాలు దెబ్బతిన గా, దీనికి తోడు ఇప్పుడు చమురు రేట్ల భారీ పతనం ఆర్‌ఐఎల్(రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) చీఫ్ నికర విలువ నుంచి 5.8 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది.

అంబానీ ప్రస్తుత నికర విలువ 41.8 బిలియన్ డాలర్లు, అదే సమయంలో జాక్ మా నికర విలువ 44.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా అంబానీ 19వ స్థానంతో వెనక్కి వెళ్లారు. ఇప్పుడు జాక్‌మా 18వ స్థానం దక్కించుకున్నారు. ఆసియాలో సంపన్నుడిగా మొదటి స్థానంలో ఉన్న ముకేశ్ ఆ స్థానాన్ని కోల్పోగా, రెండోస్థానంలో ఉన్న అలీబాబా గ్రూపు అధినేత జాక్ మా ఇప్పుడు మొదటిస్థానంలోకి వచ్చారు. కరోనా ప్రభావంతో అలీబా బా వ్యాపారంలో కూడా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులు, మొబైల్ యాప్స్ వంటి వ్యాపారాలు కొంతమేర తగ్గాయి.

12 శాతం పడిపోయిన రిలయన్స్ స్టాక్
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వివిధ షేర్లు సోమవారం 12 శాతం పడిపోయాయి. వీటితోపాటు సోమవారం అమెరికాలో ఎస్‌అండ్‌పి 500 ఇండెక్స్, డౌజోన్స్ ఇండస్ట్రియల్ సగటు7.5 శాతం పడిపోయింది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు పడిపోవడం ఇదే మొదటిసారి. మార్కెట్ల పతనంతో సంపన్నుల సంపద నిమిషాల్లో ఆవిరైపోయింది. 2018లో డాలర్ మారకంలో రిలయన్స్ మార్కెట్ విలువ 133 బిలియన్ డాలర్లకు చేరగా, రిలయన్స్ షేరు వ్యాల్యూ 35 శాతానికిపైగా లాభపడి బ్రిటిషన్ ఎనర్జీ దిగ్గజం బిపిని దాటేసింది. అప్పుడు టాప్ 6 క్లబ్ ఆయిల్ దిగ్గజ కంపెనీల్లో ముకేశ్ అంబానీ రిలయన్స్ ఒక్కటిగా నిలిచింది. కంపెనీ నికర రుణాన్ని 18 నెలల్లో సున్నాకు తగ్గించే ప్రణాళికను ముకేష్ అంబానీ 2019లో ఆగస్టులో ప్రకటించిన తర్వాత రిలయన్స్ షేరు విలువ మూడు రెట్లు పెరిగింది. తాజాగా మార్కెట్ మహా పతనం కారణంగా రిలయన్స్ షేరు 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది.

టిసిఎస్ కంటే వెనక్కి
ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్ల వరకూ ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రిలయన్స్ రెండో స్థానానికి పడిపోయింది. మార్కెట్లో భారీ నష్టంతో 2008 అక్టోబర్ నుండి కంపెనీ అతిపెద్ద క్షీణతను చూసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ .7.05 లక్షల కోట్లకు చేరుకుంది. కంపెనీ పెట్టుబడిదారుల షేర్ల విలువ సోమవారం 1.08 లక్షల కోట్ల రూపాయలు పడిపోయింది. సెన్సెక్స్ 1941 పాయింట్లు పడిపోయింది, అందులో 500 పాయింట్లు రిలయన్స్ ఇండస్ట్రీ పతనం కారణంగా జరిగింది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇప్పుడు టిసిఎస్ కంటే వెనక్కిపడిపోయింది. టిసిఎస్ మార్కెట్ క్యాప్ రూ .7.40 లక్షల కోట్లు. అదే సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఒఎన్‌జిసి షేర్లు కూడా సుమారు 16.26 శాతం తగ్గాయి. దీని మార్కెట్ క్యాప్ కూడా లక్ష కోట్ల రూపాయల కన్నా దిగువకు పడిపోయింది. ఒఎన్‌జిసి మార్కెట్ క్యాప్ రూ.93000 కోట్లకు వచ్చింది.

రెండు నెలల క్రితం మార్కెట్ క్యాప్ 10 లక్షల కోట్లు
ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే 1 లక్ష కోట్లకు పైగా తగ్గింది. రెండు నెలల క్రితం రిలయన్స్ మార్కెట్ విలువ రూ .10 లక్షల కోట్లకు పైగా ఉంది.
మార్కెట్ల పతనంతో ఇప్పుడు కంపెనీ మార్కెట్ విలువ 7 లక్షల కోట్లకు పడిపోయింది. కంపెనీ షేర్లు 13 శాతం తగ్గి రూ .1,105 కు చేరుకున్నాయి. అక్టోబర్ 2008 తరువాత ఇది అతిపెద్ద క్షీణత. ముడి చమురు సంక్షోభం కారణంగా చమురు రంగ సంస్థల స్టాక్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి.

Mukesh Ambani loses Asia richest Man title
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News