Sunday, April 28, 2024

ఐఎంపిఎస్, నెఫ్ట్‌తో చెల్లించవచ్చు

- Advertisement -
- Advertisement -

YES BANK

 

న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ బకాయిలకు గాను కస్టమర్లు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని పేర్కొంది. ఐఎంపిఎస్/ నెఫ్ట్ సర్వీసు లు అందుబాటులో ఉంటాయని, యస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలను చెల్లించవచ్చని బ్యాంక్ ట్విట్టర్ ద్వారా సమాచారమిచ్చిం ది. యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేసిన తర్వాత కొత్తగా నియమించిన ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, శనివారం నాటికి విత్‌డ్రాలపై మారటోరియం ఎత్తివేసే అవకాశముందన్నారు. మళ్లీ బ్యాంక్ కస్టమర్లకు పూర్తిస్థాయి సేవలను పునరుద్ధరిస్తుందని అన్నారు.

ఆర్‌బిఐ యస్ బ్యాంక్‌పై మారటోరియం విధిస్తూ, కస్టమర్ల డబ్బు విత్‌డ్రాపై పరిమితిని విధించింది. దీంతో నెలకు రూ. 50 వేలకు మించి విత్‌డ్రా చేయడానికి వీలువుండదు. అయితే ఒక టీవీ చానెల్ ఇంటర్వూలో యస్ బ్యాంక్ నిర్వాహకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, రూ.50 వేలకు పైగా డబ్బు విత్‌డ్రాపై విధించిన నిషేధాన్ని ఈ వారం చివరి నాటికి ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని, డబ్బు సురక్షితమని, త్వరలో నిషేధం ఎత్తివేస్తారని భరోసా ఇచ్చారు.

డబ్బు సురక్షితం : ఆర్‌బిఐ భరోసా
యస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్‌బిఐ పేర్కొంది. ప్రజలలో వ్యాపించిన అపోహలపై రిజర్వ్ బ్యాంక్ ఆదివారం ట్వీట్ చేసింది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ మాట్లాడుతూ, భారత బ్యాంకులకు మంచి మూలధన స్థావరం ఉందని, భయపడాల్సిన అవసరం లేదని అన్నా.

రాణా కపూర్‌పై బిగుస్తున్న ఉచ్చు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సిబిఐలు యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై పట్టును కఠినతరం చేశాయి. మనీలాండరింగ్ కేసులో ఇడి రాణాను అరెస్టు చేసింది. సిబిఐ కూడా మోసం, అవినీతి కేసును నమోదు చేసింది. ముంబై నుండి లండన్ వెళ్తున్న రాణా కుమార్తె రోషినీని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. రాణా కపూర్‌పై ఇడి దర్యాప్తులో రూ.2,000 కోట్ల విలువైన పెట్టుబడులు, 44 ఖరీదైన పెయింటింగ్‌లు, డజన్ల కొద్దీ డొల్ల కంపెనీలు వెలుగులోకి వచ్చాయి.

వారం రోజుల్లో ఆంక్షలు ఎత్తివేయొచ్చు

ఎస్‌బిఐ చీఫ్ రజనీష్ కుమార్

వారం రోజుల్లో యస్ బ్యాంక్ విత్‌డ్రా పరిమి తి ఆంక్షలను ఎత్తివేసే అవకాశముందని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఖాతాదారులు తమ డబ్బు గురించి ఎలాంటి ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని, తగిన చర్యలు తీసుకుంటామని యస్ బ్యాంక్ కస్టమర్లకు హామీ ఇస్తున్నామని అన్నారు. యస్ బ్యాంక్‌లో ఎస్‌బిఐ రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుందని రజనీష్ అన్నారు. నగదు కొరతతో సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ పై ఆర్‌బిఐ చర్యలు చేపట్టింది.

చీఫ్ చెప్పిన ముఖ్యాంశాలు..
బ్యాంక్‌లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎస్‌బిఐ, ఆర్‌బిఐ, ప్రభుత్వం ఏ సంస్థ సొంతంగా నిర్ణయాలు తీసుకోవు.
మూడు సంస్థలు కలిసే నిర్ణయాలు, ప్రయత్నాలు ఉంటాయి.
యస్ బ్యాంక్ మూలధనం రూ.20 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లు.
అనేక సహ పెట్టుబడిదారులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దేశీయ ఆర్థిక వ్యవస్థకు యస్ బ్యాంక్ మనుగల ఎంతో ముఖ్యం.
నియంత్రణ మూలధన నిష్పత్తిని చేరుకునేందుకు యస్ బ్యాంక్ మూలధనం అవసరం.
యస్ బ్యాంక్ మారటోరియం వారం రోజుల్లో ఎత్తివేసే అవకాశం.
ఎస్‌బిఐ అడుగు పెట్టిన తర్వాత యస్ బ్యాంక్ కస్టమర్లు తమ డబ్బు గురించి ఎలాంటి ఆందోళన చెందొద్దని హామీ ఇస్తున్నాం.
ప్రమోటర్లపై చర్యలు తీసుకుంటారు.
యస్ బ్యాంక్‌లో ఎస్‌బిఐ సహ పెట్టుబడిదారుగా ఉంటుంది.

 

Loan dues can be paid with IMPS and NEFT
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News