Tuesday, April 30, 2024

ఆసియా కుబేరుడు అంబానీ

- Advertisement -
- Advertisement -

నికర ఆస్తుల విలువ రూ.7.6 లక్షల కోట్లు,  రెండో స్థానంలో గౌతమ్ అదానీ
ఫోర్బ్ ఇండియా 100 రిచెస్ట్ లిస్ట్ 2023 వెల్లడి

న్యూయార్క్ : ఫోర్బ్ సంపన్నుల జాబితాలో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఫోర్బ్ ఇండియా ప్రతి సంవత్సరం భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా విడుదల చేసిన జాబితాలో భార త దేశానికి చెందిన ముకేశ్ అంబానీ 92 బిలియన్ డాలర్ల (రూ.7.6 లక్షల కోట్లు) నికర సంపదతో మరోసారి ఆసి యాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

మరోవైపు గౌత మ్ అదానీ 68 బిలియన్ డాలర్ల ఆస్తులతో దేశంలో రెండో స్థానాన్ని సరిపెట్టుకున్నారు. గతేడాది ఈ జాబితాలో అదానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్ జాబితా ప్రకారం, ఈ 100 మంది వ్యక్తుల మొత్తం సంపద 799 బిలియన్ డా లర్లుగా ఉంది. రెండు రోజుల క్రితం హురున్ ఇండియా రి చ్ జాబితా కూడా విడుదలైంది. ఈ జాబితాలో అంబానీకి మొదటి స్థానం లభించింది. అంబానీ సంపద ప్రతి సంవ త్సరం నాలుగు రెట్లు పెరుగుతోంది. 2014లో అంబానీ సంపద రూ.1,65,100 కోట్లు కాగా, ఇప్పుడు దాదాపు రూ.8,08,700 కోట్లకు పెరిగింది.

అయితే అదానీపై హిం డెన్‌బర్గ్ ప్రభావం కనిపించింది. ఈ సంవత్సరం ప్రారంభం లో అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై ప్రతికూల నివేదిక విడుదల చేశారు. ఈ నివేదిక తర్వాత స్టాక్‌మార్కెట్‌లో అన్ని అదానీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయి ఆయన మొత్తం ఆస్తులు 68 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇంకా ఫోర్బ్ జాబితాలో శివ్ నాడార్ 29.3 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత సావిత్రి జిందాల్ 24 బిలయన్ డాలర్ల ఆస్తులతో నాలుగో స్థానం దక్కించుకున్నారు.

భారతదేశంలోనిటాప్ 10 సంపన్నుల జాబితా
పేరు సంపద
ముకేశ్ అంబానీ 92 బిలియన్ డాలర్లు
గౌతమ్ అదానీ 68 బిలియన్ డాలర్లు
శివ నాడార్ 29.3 బిలియన్ డాలర్లు
సావిత్రి జిందాల్ 24 బిలియన్ డాలర్లు
రాధాకిషన్ దమాని 23 బిలియన్ డాలర్లు
సైరస్ పూనావాల 20.7 బిలియన్ డాలర్లు
హిందూజా గ్రూప్ 20 బిలియన్ డాలర్లు
దిలీప్ సంఘ్వీ 19 బిలియన్ డాలర్లు
కుమార్ బిర్లా 17.5 బిలియన్ డాలర్లు
షాపూర్ మిస్త్రీ అండ్ గ్రూప్ 16.9 బిలియన్ డాలర్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News