Friday, May 3, 2024

రంజాన్ ప్రార్థనలు ఇంటివద్దే.. లాక్‌డౌన్ కు ముస్లిం మత పెద్దల మద్దతు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్నివిధాలుగా సహకరిస్తామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఈ నెల 25 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుండడంతో పలువురు ముస్లిం మత పెద్దలతో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ముస్లిం మత పెద్దలు ఖుబుల్ పాషా సత్తారి, ముప్తి ఖలీల్ అహ్మద్, మహ్మద్ పాషా, ఇఫ్తెకారి పాషాలు మీడియాతో మాట్లాడారు. రంజాన్ మాసంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్ నియమ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని వెల్లడించారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు.
మంత్రి కెటిఆర్‌ను కలిసి ముస్లింమత పెద్దలు
వీడియ కాన్ఫరెన్స్ నిమిత్తం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయానికి వచ్చిన మంత్రి కె.తారక రామారావును ముస్లిం మత పెద్దలు స్వచ్చంధగా వెళ్లి కలిశారు. మీడియా సమావేశం అనంతరం వారు మంత్రి కెటిఆర్‌ను కలిసి లాక్‌డౌన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు తాము సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ మహమ్మరి నుండి బయటపడమే మన ముందున్న లక్షమని వారు పేర్కొన్నారు.

Muslim Religious Leaders Meets Minister KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News