Thursday, May 9, 2024

సంబంధం లేని కేసులో నా పేరు చేర్చారు: నారా లోకేశ్

- Advertisement -
- Advertisement -

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా చేర్చడంపై లోకేశ్ స్పందన

మన తెలంగాణ/హైదరాబాద్ : సంబంధం లేని కేసులో తనను ఎ14గా చేర్చారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ పేరును సిఐడి అధికారులు చేర్చారు.ఈ మేరకు సిఐడి అధికారులు కోర్టులో మెమోను అందించారు. అయితే ఈ కేసు విషయమై నారా లోకేశ్ మంగళవారం నాడు స్పందించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో తనకు సంబంధం లేదన్నారు. యువగళం పేరు వింటేనే జగన్ గజగజలాడుతున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టినా,అక్రమ అరెస్టులు చేసినా యువగళం ఆగదని లోకేశ్ స్పష్టం చేశారు.

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అప్పట్లో చంద్రబాబు సర్కార్ చేపట్టింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను అడ్డగోలుగా మార్చారని జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది. ఈ విషయమై సిఐడికి ఫిర్యాదు చేసింది.ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. మాజీ మంత్రి నారాయణ, చంద్రబాబుపై సిఐడి అభియోగాలు మోపింది. తమ వారి భూములకు విలువ పెరిగేలా అలైన్ మెంట్ ను మార్చారని సిఐడి ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబుపై పిటి వారంట్ కూడా దాఖలు చేసింది. ఎపి ఫైబర్ నెట్ కేసులో కూడ చంద్రబాబుపై కోర్టులో సిఐడి అధికారులు పిటి వారంట్లు దాఖలు చేసిన విషయం విదితమే . ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్టయ్యారు. ఈ కేసులో అరెస్టై జ్యుడిషీయల్ రిమాండ్‌లో ఉన్నారు వచ్చే నెల 5వ తేదీ వరకు చంద్రబాబుకు ఎసిబి కోర్టు రిమాండ్ విధించిన విషయం విదితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News