Tuesday, April 30, 2024

ఎదురులేని నాదల్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ బుల్, రెండో సీడ్ రఫెల్ నాదల్ ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ అలవోక విజయం అందుకున్నాడు. బ్రిటన్ ఆటగాడు కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ 75, 62, 75తో విజయం సాధించి నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరి వరకు జోరును ప్రదర్శించిన నాదల్ వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ ఆండ్రి రుబ్లేవ్ (రష్యా) విజయం సాధించాడు. మూడో రౌండ్‌లో రుబ్లేవ్ స్పెయిన్‌కు చెందిన ఫెలిసియానా లోపేజ్‌ను ఓడించాడు. మరో పోటీలో 9వ సీడ్ మాటియో బెర్రెటిని (ఫ్రాన్స్) జయకేతనం ఎగుర వేశాడు. ఇతర పోటీల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), నాలుగో సీడ్ డానియల్ మెద్వెదేవ్ (రష్యా) తదితరులు విజయం సాధించి నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆశ్లే బార్టీ మూడో రౌండ్‌లో విజయం సాధించింది. రష్యా క్రీడాకారిణి ఎకటరినాతో జరిగిన పోరులో బార్టీ జయకేతనం ఎగుర వేసింది. అయితే ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్) ఓటమి పాలైంది. తన దేశానికే చెందిన ముచోవాతో జరిగిన మూడో రౌండ్‌లో ప్లిస్కోవా పరాజయం చవిచూసింది. ఐదో సీడ్ స్విటోలినా (ఉక్రెయిన్), 18వ సీడ్ ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం) తదితరులు నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు.

Nadal reached quarter final in Australian Open 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News