Saturday, April 27, 2024

చలో నాగార్జునసాగర్

- Advertisement -
- Advertisement -

Nagarjunasagar Assembly bypoll

ఉప ఎన్నికల ప్రచారానికి గ్రేటర్ నేతలు
ప్రతి నియోజకవర్గం నుంచి 50మంది కార్యకర్తలు
ఓయూ నుంచి బయలు దేరుతున్న విద్యార్థి నాయకులు
వారం రోజలు అక్కడే ఉండి జోరుగా ప్రచారం చేయనున్న నగర నాయకులు

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోరు జోరందుకుంది. ప్రచారం గడువు సమీపిస్తుండటంతో రేసు గుర్రాలు ప్రచారరథాలపై పరుగులు పెడుతూ హామీల జల్లు కురిపిస్తున్నారు. ఈనెల 17వ పోలింగ్ ఉండటంతో మందీ మార్బలం కళాకారుల ఆట పాటలతో అట్టహాసంగా వెళ్లుతూ ఈసారి తమకు మద్దతు పలకాలని ఓటర్లకు దండాలు పెడుతున్నారు. ఈఎన్నికల్లో 41మంది అభ్యర్దులు పోటీ చేయగా, ప్రధాన పోటీ అధికార టిఆర్‌ఎస్ అభ్యర్ది దివంగత నేత నోముల నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, బిజెపి పార్టీ తరుపున బరిలో నిలిచిన డా. రవినాయక్ మధ్య ఉంది. గత ఐదు రోజులుగా జరుగుతున్న ప్రచారంలో టిఆర్‌ఎస్ అభ్యర్ది నోముల భగత్‌కు నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లి జనా నీరాజనం అందుకుంటున్నారు.

ఆయన గెలుపు కోసం జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు, హైదరాబాద్ కు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు గ్రేటర్ 24 నియోజకవర్గాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లుతున్నారు. నామినేషన్ వేసినప్పడు హోంమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు కార్పొరేటర్లు వెళ్లారు. తాజాగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50మంది చొప్పన గులాబీ కార్యకర్తలకు సాగర్ వెళ్లి వారం రోజుల పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు కదులుతున్నారు. సాగర్ పోరులో విపక్షపార్టీలు ఖంగుతినేలా భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ అభ్యర్దిని గెలిపిస్తామని నగరానికి చెందిన పలువురు నాయకులు పేర్కొంటున్నారు. గులాబీ పార్టీకి చెందిన 58 మంది కార్పొరేటర్లు బాధ్యతలు తీసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసి సిఎం కెసిఆర్‌కు నాగార్జున సాగర్ గెలుపు కానుకగా ఇస్తామంటున్నారు.

సాగర్ ప్రచారానికి ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులు

నాగార్జునసాగర్ పోరులో పార్టీ విజయం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఉద్యమ నాయకులు, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్, రాజారాం యాదవ్, బొల్లు నాగరాజు, పెద్దమ్మ రమేష్, నాగారం ప్ర శాంత్, దశరథ్ వెళ్లుతున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ప్రతి మండలానికి ఇద్దరు విద్యార్థి సంఘాలకు బాధ్యతలు అప్పగించి స్దానిక విద్యార్థుల సంఘాల సహకారంతో గడప గడపకు తిరిగి పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని వారు పేర్కొంటున్నారు. సిఎం కెసిఆర్‌తో రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకపోతుందని, భవిష్యత్తుల్లో రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఎదురులేదని, జనారెడ్డి రెండోసారి ఓటమి చవిచూడక ఎద్దేవా చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News