Saturday, May 4, 2024

మళ్లీ క్వారంటైన్ సెంటర్లు

- Advertisement -
- Advertisement -

Covid-19 Quarantine centers again in Telangana

హైదరాబాద్‌లోని ఆసుపత్రులను సందర్శించిన కలెక్టర్ శ్వేతా మహంతి

 

హైదరాబాద్ : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,712 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే మొత్తం 3,10, 819కు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 6900 యాక్టివ్ కేసులు ఉండగా.. 3.02 లక్షలు మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ 283, మేడ్చల్ 113, రంగారెడ్డిలో 104, నిజామాబాద్‌లో 75, నిర్మల్‌లో 40, కరీంనగర్‌లో 34 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తిరిగి క్వారంటైన్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి నగరంలోని నేచర్ క్యూర్, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులను శనివారం సందర్శించారు. ఆసుపత్రుల్లో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు గురించి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో డిసెంబర్ 2020 వరకు ఐసోలేషన్ కేంద్రాలుండగా, వాటిని కరోనా ప్రభావం తగ్గడంతో తొలగించారు. మళ్లీ కరోనా మహామ్మారి విజృంభిస్తుండటంతో వాటిని తెరవడానికి ఆసుపత్రుల సూపరింటెండెట్స్, ఇతర వైద్యాధికారులతో సమీక్షించారు.

సెకండ్‌వేవ్ ప్రమాదకరం

కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ సోకిన కొద్దిమందిలో ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణిస్తోంది. గతంలో 7 నుంచి 12రోజుల్లో ఆరోగ్యం క్షీణిస్తే ప్రస్తుతం నాలుగైదు రోజులకే ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు చెప్తున్నారు. గతంలో పెద్ద వయసు వారిలో మాత్రమే ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతినగా, ఇప్పుడు పెద్దవారితోపాటు యువతలోనూ అదే ప రిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి సీరియస్ అయి ఆక్సిజన్‌బెడ్, వెంటిలేటర్‌పైకి వెళ్లినవారిలో కంటిచూపు దెబ్బతింటోంది. రెటీనా ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తోంది. ఇది కొత్త లక్షణం అని వైద్యులు చెప్తున్నారు.

వారం రోజుల్లో 4,432 కేసులు, 23 మరణాలు

తెలంగాణలో మార్చి 20-26 మధ్య 2,949 కరోనా కేసులు నమోదుకాగా.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు 4,432 కేసులు నమోదు కావడం గమనార్హం. గతవారం మరణాలు 19గా ఉండగా, ఈ వారం 23కు పెరిగాయి. సగటున రోజుకు నాలుగు మరణాలు నమోదవుతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. కొత్త స్ట్రెయిన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, మొదటి వేవ్‌లో 15 నిమిషాలు పాజిటివ్ రోగితో ఉంటే ఇతరులకు వైరస్ వ్యాప్తి జరిగేదని ఇప్పుడు నాలుగైదు నిమిషాలు ఉన్నా వ్యాపిస్తోందని స్పష్టం చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News