Saturday, April 27, 2024

రేషన్ కార్డులో దత్తా కాస్తా కుత్తా అయితే…

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లా ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన గడప గడపకూ ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఓ వింత ఘటన చోటుచేసుకున్నది. రేషన్‌ కార్డులో తన ఇంటిపేరు దత్తాకు బదులుగా కుత్తా అని పడటంతో.. ఓ వ్యక్తి కుక్కలా మొరుగుతూ జాయింట్‌ బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (బిడిఓ) ఎదుట నిరసన వ్యక్తంచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

శ్రీకాంతి కుమార్‌ దత్తా అనే వ్యక్తి పేరును రేషన్‌ కార్డులో శ్రీకాంతి కుమార్‌ కుత్తాగా ముద్రించారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. దీంతో తన పేరును మార్చాలని కుక్కలా అరుస్తూ అధికారికి అర్జీ పెట్టుకున్నాడు. కాగా, తన పేరు ఇలా తప్పుగా ప్రింట్‌ కావడం ఇది మూడోసారని శ్రీకాంతి కుమాచ్‌ చెప్పారు. తొలిసారి తన పేరును శ్రీకాంత మొండల్‌ అని రాశారని, తప్పును సరిచేయాలని దరఖాస్తు చేసుకోవడంతో దానికి శ్రీకాంతో దత్తగా మార్చారని చెప్పారు. అయితే దానిని గుర్తించిన తాను తప్పును సరిచేయాలని మరోసారి అధికారులను కోరారని చెప్పారు. దీంతో శ్రీకాంతి కుమార్‌ దత్తాకు బదులు కుత్తాగా టైప్‌చేశారని చెప్పారు. ఈనేపథ్యంలో తాను మరోసారి గడప గడపకూ ప్రభుత్వం క్యాంపునకు వచ్చానని, తన అభ్యర్థనను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన ఆయన ఇలా వినూత్నంగా నిరసన తెలిపి తన బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News