Friday, April 26, 2024

నిజమైన ప్రేమను మీతోనే అనుభవించా

- Advertisement -
- Advertisement -

Special song to release on Chiranjeevi's Birthday Aug 22

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు సహా శ్రేయోభిలాషుల నుండి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి… మహేష్‌కు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ చెప్పారు. ఇక హీరోయిన్లు సమంత, పూజాహెగ్డే, రకుల్‌ప్రీత్ సింగ్, త్రిష, కాజల్ అగర్వాల్, కియారా అద్వానీ, శృతిహాసన్, కృతిసనన్ తదితరులు ఈ సూపర్‌స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మహేష్ భార్య నమ్రత ఇంకాస్త అడ్వాన్స్‌డ్‌గానే తనకు విషెస్ తెలిపింది. శనివారం రాత్రి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తకు శుభాకాంక్షలు చెప్పింది. మహేష్ నుదిటిపై ముద్దు పెడుతూ ఉన్న అందమైన ఫోటోను నమ్రత పోస్ట్ చేసింది “నిజమైన ప్రేమను నేను మీతోనే అనుభవించాను.. హ్యాపీ బర్త్ డే ఎంబి.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను… ఇప్పుడు అప్పుడు ఎల్లపుడూ” అని పేర్కొంది నమ్రత. అయితే మహేష్ కుమారుడు ఘట్టమనేని గౌతమ్ కూడా తన తండ్రికి బర్త్‌డే విషెస్ తెలిపాడు. సోషల్ మీడియాలో తన స్వీట్ విషెస్ తెలుపుతూ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Namrata emotional birthday wishes to Mahesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News