Sunday, May 5, 2024

ఎడారిలో ‘నారప్ప’ పోరాటాలు

- Advertisement -
- Advertisement -

వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మాట్లాడుతూ “తమిళనాడులోని రెడ్ డిసర్ట్‌లో 10 రోజులు తీసిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. వెంకటేష్‌కి, నాకు ‘నారప్ప’ ఒక థ్రిల్లింగ్ అనుభూతినిస్తోంది”అని అన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. “నారప్ప చాలా పవర్‌ఫుల్, ఎమోషనల్ క్యారెక్టర్. ప్రేక్షకులు నారప్పగా కొత్త వెంకటేష్ ని ఈ చిత్రంలో చూస్తారు” అని తెలిపారు. సహ నిర్మాత దేవి శ్రీదేవి సతీష్ మాట్లాడుతూ “తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడులో ‘నారప్ప’ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాము. 12,000 ఎకరాల్లో ఉండే ఈ ప్రదేశాన్ని రెడ్ డిసర్ట్ ఆఫ్ తమిళనాడు అని అంటారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాము”అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం.

Narappa movie Action Sequence in Tamil Nadu

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News