Saturday, May 11, 2024

ఈ సినిమాలో ఉన్న లొల్లి ప్రతి ఇంట్లో ఉండేదే

- Advertisement -
- Advertisement -

సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ బిగ్ సీడీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ “నా ఫ్రెండ్స్ యు.ఎస్. వెళ్లిపోతుంటే నేను చాలా బాధపడుతుంటా. మా గ్రూప్‌లో సగం మంది అలా వెళ్లిపోయి… సగం మంది ఇక్కడ మిగిలిపోయాం. ఆ విషయంపై చేసిన మూవీ కాబట్టి ‘ప్రెషర్ కుక్కర్’ అదిరిపోతుంది”అని అన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ “ఈ సినిమాలో ఉన్న లొల్లి ప్రతి ఇంట్లో ఉండేదే. ఆ సమస్యను తీసుకొని ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూసి బాగా కనెక్టయ్యాను. ప్రతివాళ్లూ కనెక్టవుతారు. సుజోయ్, సుశీల్ చాలా బాగా సినిమా తీశారు”అని తెలిపారు.

దర్శకులు సుజోయ్, సుశీల్ మాట్లాడుతూ “రామేశ్వర్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. మాతో ఎలాంటి బంధం లేకపోయినా డైరెక్టర్ క్రిష్ మా మూవీ చూసి నచ్చి.. మాకు సహాయం చేయాలని భావించారు. ఈ మూవీ ప్రారంభ దశ నుంచి మధుర శ్రీధర్ మాకెంతో సహాయపడ్డారు. తరుణ్ భాస్కర్ కూడా సహాయం చేశారు. ఈ నెల 21న విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిష్, నందినీ రెడ్డి, మధుర శ్రీధర్ రెడ్డి, సాయి రోనక్, ప్రీతి, తనికెళ్ల భరణి, సంగీత, రాహుల్ సిప్లిగంజ్, అప్పిరెడ్డి, సివిఎల్ నరసింహారావు, కిరీటి, రాజై రోవన్, నోయల్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Pressure Cooker Movie Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News