Saturday, May 4, 2024

‘నారప్ప’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Hero Venkatesh Narappa Movie Teaser Release
హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్ నటించిన ‘నారప్ప’ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వెంకటేష్ జతగా ప్రియమణి నటిస్తోంది. సురేష్ ప్రొడెక్షన్స్ పతాకంపై సురేష్ బాబు నిర్మిస్తుండగా సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు పేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో జులై 20న విడుదల చేస్తామని సినిమా యూనిట్ తెలిపింది. కానీ ఆన్‌లైన్‌లో నారప్ప ట్రైలర్‌ను విడుదల చేశారు. వెంకటేష్ భూమి కోసం పోరాటం చేసే యోదుడిగా కనిపిస్తాడు. మన దగ్గర డబ్బు, భూమి ఉంటే తీసుకుంటారు కానీ చదువు మాత్రం తీసుకోరు అనే డైలాగ్ సూపర్‌గా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తమిళంలో రికార్డు సృష్టించిన అసురన్ అనే చిత్రాన్ని నారప్పగా రీమేక్ చేశారు. నారప్పలో తెలుగు నెటివిటీ తగినట్లుగా మార్పులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News