Friday, May 3, 2024

అంగారక గ్రహంపై 12న ఎగరడానికి నాసా హెలికాప్టర్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

NASA helicopter ready to fly to Mars on the 12th

అదేరోజు రాత్రి నాసా లేబొరేటరీకి మొదటి డేటా విడుదల

వాషింగ్టన్ : నాసా ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్ ఈనెల 12న తన స్థావరం నుంచి అంగారక గ్రహంపై ఎగరడానికి సిద్ధమైంది. దీనికి ముందు దాదాపు అన్ని సాహసోపేత లక్షాలను పూర్తి చేసుకోవలసి ఉంటుంది. పెర్సెవరెన్స్ రోవర్ నుంచి అంగారక తలంపైకి జారిన తరువాత ఇన్‌జెన్యుటీ తన రేకులను విచ్చుకుని నెమ్మదిగా భ్రమించే పరీక్షను గురువారం నిర్వహించింది. ఈ పరీక్ష తాలూకు క్షేత్రస్థాయి చిత్రాన్ని నాసా జెట్ ప్రొపల్సన్ లేబొరేటరీ (జెపిఎల్) విడుదల చేసింది. 1.8 కిలోగ్రాముల బరువున్న హెలికాప్టర్ తన స్థావరం నుంచి ఈనెల 12 ఉదయం 8.24 గంటలకు టేకాఫ్ అవుతుంది. అంగారక ఉపరితలంపై 10 అడుగుల ఎత్తున 30 నిముషాల పాటు గగనంలో విహరిస్తుంది. అంగారక గ్రహానికి భూమికి మధ్య ఉన్న 278 మిలియన్ కిలోమీటర్లు దూరం రేడియో సిగ్నల్స్‌కు అనుసంధానం కాడానికి 15 నిమిషాలు, 27 సెకండ్లు పడుతుంది.

ఈ హెలికాప్టర్ విహారానికి సంబంధించిన మొదటి డేటా దక్షిణ కాలిఫోర్నియా లోని నాసా జెట్ ప్రొపల్సన్ లేబొరేటరీకి ఈనెల 12 రాత్రి 1.45 కు చేరుతుంది. భూమి వాతావరణం కన్నా అంగారక వాతావరణం సాంద్రత 99 శాతం తక్కువైనందున హెలికాప్టర్ పైకి లేవడం కష్టసాధ్యమౌతుందని, ఇది విజయవంతమైతే భవిష్యత్ అంగారక యాత్రలకు ప్రతిష్టాత్మక వాస్తవ ప్రమాణాలను అందిస్తుందని నాసాకు చెందిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బచెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది జులైలో నాసా పెర్సవరెన్స్ ప్రయోగం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్‌తో పెర్సవరెన్స్ అంగారక కక్షకు చేరుకుంది. రోవర్ అంగారక గ్రహంపై దిగగానే పెర్సవరెన్స్ తన హెలికాప్టర్‌ను కిందకు జారవేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News