Saturday, April 27, 2024

ఏలియన్స్‌పై అధ్యయనానికి నాసా శ్రీకారం

- Advertisement -
- Advertisement -

Aliens

వాషింగ్టన్ : శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలించి ఏలియన్స్ నిజంగా కనిపిస్తే మానవుల పరిస్థితి ఏంటి? వాళ్లు ఎలా స్పందిస్తారు? ఇన్నాళ్లుగా వాళ్లు పాటిస్తున్న విశ్వాసాలపై వారి అభిప్రాయం మారుతుందా? పురాణేతిహాసాలు, దేవుడి సృష్టి వంటి భావనలు ఎలా మారనున్నాయి? ఏలియన్స్ ప్రభావం ఈ భూమిపై ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం నాసా ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రయోగాలతోపాటు మానవ ఆలోచనా విధానం తెలుసుకొని విశ్లేషించేందుకు 24 మంది తత్వవేత్తలను, వివిధ మతాలకు చెందిన పండితులను, ఎంపిక చేసింది. ప్రస్తుతం ఎదురౌతున్న ఎన్నో సందేహాలపై అధ్యయనం చేయాలని కోరింది. అమెరికా లోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో సెంటర్ ఫర్ బయోలాజికల్ ఎంక్వైరీ( పీటీఐ) లో ఈ అధ్యయనం నిర్వహించనున్నారు. దీనికి నాసా ఇప్పటికే రూ.829 కోట్లు (1.1 మిలియన్ డాలర్లు) కేటాయించింది. వివిధ రంగాల ప్రముఖుల నుంచి వీరు అభిప్రాయాలు సేకరించి నివేదిక తయారు చేస్తారు. ఈ 24 మంది తత్వవేత్తల్లో రెవరెండ్ ఆండ్రూ డేవిషన్ కూడా ఉన్నారు. ఏలియన్స్‌పై మానవుల స్పందన అనేది వారు పాటించే మత సంప్రదాయాల బట్టి మారుతుందని, నాస్తికుల ఆలోచనల్లో కూడా మార్పులు రావచ్చని పేర్కొన్నారు. ఏలియన్స్‌ను కనిపెట్టడంలో మనం చాలా దగ్గరగా ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News