Sunday, April 28, 2024

చంద్రుని ఆవలి వైపు చిత్రం విడుదల

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భూ తలం నుంచి చూసినప్పుడు అరుదుగా కనిపించే చందమామ ఆవలి వైపు చిత్రాన్ని అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఇటీవల విడుదల చేసింది. తరచు ‘చీకటి ప్రదేశం’గా పొరబడుతుందే ఆ ప్రాంతం భూమికి ఎదురుగా ఉన్న మాదిరిగానే వెలుతురుతో కనిపించింది. కాని, దాని విశిష్ట లక్షణాలు, మన గ్రహం నుంచి నేరుగా చూడలేని మన అశక్తత కారణంగా అది అంతుపట్టనిదిగానే ఉన్నది. చంద్రుని ఆవలి వైపు మామూలుగా కనిపించే ప్రాంతానికి భిన్నంగా ఉన్నది. మిట్ట పల్లాలతో, కందకాలతో ఆ ప్రాంతం ఉన్నది. చంద్రుని పరిభ్రమణం భూమి చుట్టూ తిరిగే సమయాని పోలి ఉన్నది. దీనితో చంద్రుని ఉపరితలం మన వైపే ఉన్నట్లు ఉంటుంది. ఫలితంగా చంద్రుని ఆవలి వైపు అంతుపట్టని రీతిలో ఉంటున్నది. రోదసీ యాత్రలు లేదా ఉపగ్రహ టెక్నాలజీతో మాత్రమే అది దృగ్గోచరం కాగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News