Friday, August 8, 2025

నేషనల్ అవార్డు వచ్చిన సింగర్.. మరో శుభవార్త చెప్పాడు..

- Advertisement -
- Advertisement -

కేంద్రం ఇటీవలే సినిమాలకు జాతీయ అవార్డుకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలుగు సినీ పరీశ్రమకు పలు అవార్డులు లభించాయి. ఈ అవార్డుల్లో సింగర్ పివిఎన్ఎస్ రోహిత్‌కి (PVNS Rohit) ‘బేబి’ సినిమాలో ‘ప్రేమిస్తున్న అనే పాట పడినందుకు జాతీయ అవార్డు లభించింది. రోహిత్‌ చాలా మంచి టాలెంటెడ్ సింగర్. ఇప్పటికే అతను చాలా పాటలు పాడాడు. జైలర్, హనుమాన్, ప్రేమలు, కొండపొలం, సరిపోదా శనివారం, నేల టికెట్ తదితర చిత్రాల్లో తన గానంతో ప్రేక్షకులను అలరించాడు. ఇక బేబి సినిమాతో అతనికి జాతీయ అవార్డు వచ్చింది.

జాతీయ అవార్డు వచ్చిన కొన్ని రోజులకే.. రోహిత్ (PVNS Rohit) మరో శుభవార్తను చెప్పాడు. తను నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. చాలా రోజులుగా రోహిత్..డాక్టర్ శ్రేయ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తాజాగా ఆమెతో నిశ్చితార్థం జరుపుకొని కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఈ వేడుక సింపుల్‌గా కుటుంబసభ్యుల మధ్య జరిగింది. ఈ ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా తోటి సింగర్స్, అభిమానలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి పెళ్లి గురించి రోహిత్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News