Saturday, May 4, 2024

పదవి కావాలంటే నా భర్త కేంద్రంలో మంత్రిగా ఉండేవారు

- Advertisement -
- Advertisement -

Navjot Kaur Sidhu Makes Big Statement On Husband's Future

 

నవజోత్‌సింగ్‌సిద్ధూ భార్య కౌర్

చండీగఢ్: తన భర్త ఏ పదవినీ కోరుకోవడంలేదని, పంజాబ్ ప్రజలకు సేవ చేయడమే ఆయన ఆలోచన అని మాజీమంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ అన్నారు. తాము రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదని, అలా భావిస్తే ఆయన కేంద్రంలో మంత్రిగా ఉండేవారని కౌర్ అన్నారు. 2016లో బిజెపి నుంచి బయటకొచ్చిన విషయాన్ని ఆమె పరోక్షంగా గుర్తు చేశారు. బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌తో సిద్ధూ భేటీకి ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ భేటీ సందర్భంగా సిద్ధూను అమరీందర్ తన కేబినెట్‌లోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో కౌర్ వివరణ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News