Tuesday, May 14, 2024

పంజాబ్ పిసిసి చీఫ్‌గా సిద్ధూ?

- Advertisement -
- Advertisement -

Navjot Singh Sidhu to be Punjab PCC chief

న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో అంతర్గత కుమ్మలాటపై కాంగ్రెస్ హైకమండ్ దృష్టి సారించింది. సిఎం అమరీందర్ సింగ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నడుమ రాజీ కుదిర్చేలా ఒక ఒప్పందాన్ని తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో పంజాబ్ పిసిసి చీఫ్‌గా సిద్ధూని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత పంజాబ్ పిసిసి చీఫ్ సునీల్ జక్కర్ స్థానంలో సిద్దూను నియమించనున్నారు. మరో ఇద్దరు సీనియర్ నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉంది. పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ హరీశ్ రావత్ బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సిద్దుకు పంజాబ్ పార్టీ బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చించినట్లు సమాచారం.

Navjot Singh Sidhu to be Punjab PCC chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News