Monday, April 29, 2024

సొంత నిర్మాణంలో నాలుగు సినిమాలు

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల పెద్ద హీరోల సరసన సినిమా అవకాశాలు రావండ లేదు. ఇటీవల బాలీవుడ్‌లో షారుక్ సరసన జవాన్ వంటి బిగెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీలో నటించింది నయన్. ఆ తరువాత, తెలుగు, తమిళ భాషల్లో ఆమె పెద్ద హీరోల సరసన నటించిన సినిమాలు లేవు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటడ్ చిత్రాలు, చిన్న చిత్రాలు ఎక్కువగా చేస్తోం ది. అలాగే తన నిర్మాణ సంస్థని బోలోపేతం చేసే పనిలో ఉన్న ట్లు సమాచారం. తన భర్త విగ్నేష్‌తో కలిసి ఆమె రౌడీ పిక్షర్స్ అనే సంస్థని ఇటీవల స్థాపించింది. దానిపై వరుసగా సినిమాలు తీస్తోంది. ఇప్పుడు మరో నాలుగు సినిమాలు ఈ బ్యానర్‌పై ప్లా న్ చేస్తున్నట్లు టాక్. కొంత కాలం క్రితం నయనతార తల్లి అయిన విషయం తెలిసిందే. అటు సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు సినిమాలు కూడా ఆమె చేస్తోంది. కాకపోతే ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చెయ్యడం తగ్గించింది. ఇప్పుడు ఆమె తన భర్త విగ్నేష్‌ని దర్శకుడిగా, నిర్మాతగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News