Wednesday, May 22, 2024

ఇదేం ఎన్‌సిసి శిక్షణా ..శిక్షనా

- Advertisement -
- Advertisement -

థానే : ఓ వైపు భారీ వర్షం. ఎనమండుగురు తలలు బురదలో ఉండగా, వారి వెనుక చేతిలో లాఠీ పట్టుకున్న వ్యక్తి వారి పాదాలపై చితకబాదడం…ఇదేదో భయానక సినిమాలో ఘట్టం కాదు. థానేలోని బండోద్కర్ కాలేజీలో ఎన్‌సిసి శిక్షణా శిబిరంలోని వాస్తవిక ఘట్టం. బురదలో నెత్తితో , మోకాళ్లపై వంగి ఉన్న ఈ ఎనమండుగురిని ఒకరితరువాత ఒకరిగా ఎన్‌సిసి క్యాడెట్ సీనియర్ చితకబాదుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. సరైన రీతిలో వీరు డ్రిల్ చేయలేకపోయినందుకు వీరికి ఈ సీనియర్ ఈ విధమైన శిక్ష విధించాడు.

వీరు దీనిని బురదలో ముఖం పెట్టుకుని భరించారు. దెబ్బలు తాళలేక కొందరు పెడబొబ్బలు పెట్టారు. జరిగిన తతంగాన్ని కాలేజీ విద్యార్థి ఒకరు తన సెల్‌ఫోన్ ద్వారా చాటుగా చిత్రీకరించారు. జరిగిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ సుచరిత్ర నాయక్ స్పందిస్తూ ఇటువంటివి చాలా తీవ్రమైన విషయాలని , ఈ ప్రవర్తనను తాను సహించేది లేదని, సీనియర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఎన్‌సిసి ద్వారా చాలా మంచి పనులు కూడా జరుగుతున్న వైనాన్ని గుర్తించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News