Saturday, April 27, 2024

బెంగాల్‌పై హోంశాఖకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బెంగాల్‌పై హోంశాఖకు ఫిర్యాదు
ఎన్‌సిడబ్లు ఛైర్‌పర్సన్ రేఖాశర్మ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై దాడుల ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) తీవ్రంగా స్పందించింది. తమకు ఇప్పటికే 260 ఫిర్యాదులు అందాయని, వీటిపై రాష్ట్ర అధికార యంత్రాంగం పదిహేను రోజులలో సమాధానం ఇచ్చుకోవాలని కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ శనివారం తెలిపారు. గడువులోగా జవాబు రాకపోతే విషయాన్ని తదుపరి చర్యలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు నివేదించడం జరుగుతుందని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తతపై దర్యాప్తు కోసం శర్మ రాష్ట్రానికి రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ ఫిర్యాదులలో రెండింటిపై ఇప్పటికే మహిళా హక్కుల సంస్థ సొంతంగా తన విచారణ చేపట్టింది. అయితే రాష్ట్రంలో మహిళలపై దాడులు అతి తక్కువగానే జరుగుతున్నాయని అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ తెలియచేసుకుంది.

కోల్‌కతాలో లక్ష మంది జనాభా నిష్పత్తిలో చూసుకుంటే కేవలం ఒక్క ఘటన చోటుచేసుకొంటోందని టిఎంసి తెలిపింది. బిజెపి పాలిత గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఘటనలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని వివరించారు. అయితే ఈ వాదనతో రేఖాశర్మ ఏకీభవించలేదు. పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి తమకు ఆందోళన కల్గిస్తోందని, ఘటనలు జరుగుతున్నాయని తాము చెపుతున్నామని, అయితే పోలీసులు ఏ విధంగా కూడా స్పందించడంలేదని, ఎటువంటి చర్యలకు దిగడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తాము ఈ సమస్యపై ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ, డిజిపి కానీ తమను కనీస పద్ధతి ప్రకారం కలుసుకోవడం లేదని, ఈ విధంగా పలుసార్లు జరిగిందని విమర్శించారు. ఏ విషయం గురించి ఏమీ తెలియని కింది స్థాయి ఉద్యోగులను పంపిస్తున్నారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News