Friday, April 26, 2024

చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి నెగటివ్ రిపోర్టు

- Advertisement -
- Advertisement -

ktr

 

హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు చికిత్సపొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి వైద్య పరీక్షలు చేయగా వారికి నెగటివ్ రిపోర్టు వచ్చిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మిగతా వారికి కూడా నెగటివ్ రిపోర్టు రావాలని ఆయన కోరుతూ ఆదివారం ట్విట్టర్ చేశారు. అలాగే వైరస్ అనుమానితులను ఐసోలేట్ చేయడానికి, రోగులకు అవసరమైన చికిత్స అందించేందుకు రాష్ట్రంలో 8 ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా వినియోగించుకోవాలని వైద్య,ఆరోగ్యశాఖ నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తుండగా తాజాగా కింగ్‌కోఠి ఆసుపత్రిని కూడా కరోనా చికిత్సకే పూర్తిగా వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కెటిఆర్ ట్విట్టర్‌లో తెలిపారు.

అధునాతన వైద్యసౌకర్యాలతో కింగ్‌కోఠి ఆసుపత్రిని సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో 350 పడకలను సిద్ధం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మరోనాలుగు ప్రత్యేక ఆసుపత్రులను కూడా పూర్తిగా కరోనా రోగుల చికిత్స కోసమే సిద్ధం చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన 150 అన్నపూర్ణ క్యాంటీన్లలో శనివారం 30 వేల మంది భోజనం చేశారని కెటిఆర్ ట్విట్టర్‌లో కెటిఆర్ పేర్కొన్నారు. అలాగే రాత్రి 7500 మంది భోజనం చేశారని తెలిపారు. పేదలు, వలసకూలీలు, లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకున్న వారికి ఇబ్బందులు కలగ కుండా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలమేరకు 150 అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు ఉచిత భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

Negative report for 11 of Corona victims
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News