Tuesday, May 21, 2024

కార్తీక్‌ను తప్పించాల్సిందే!

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమైన కార్తీక్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని అభిమానులు సూచిస్తున్నారు. జట్టును ముందుండి నడిపించడంలో కార్తీక్ పూర్తిగా విఫలమయ్యాడని, అతన్ని తప్పించి ఇయాన్ మోర్గాన్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించడమే మంచిదని అభిమానులు సూచిస్తున్నారు. మరోవైపు ఆకాశ్ చోప్రా, గంభీర్, సెహ్వాగ్ తదితరులు కూడా కార్తీక్‌ను తప్పిస్తేనే బాగుంటదని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్‌గా, ఆటగాడిగా కార్తీక్ పూర్తిగా వైఫల్యం చెందాడని ఇటువంటి స్థితిలో అతన్ని కొనసాగించడంలో అర్థం లేదని వారు పేర్కొంటున్నారు. ఇక జట్టు యాజమాన్యం కూడా కార్తీక్‌పై గుర్రుగా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు పరిస్థితులు ఇలాగే ఉంటే కార్తీక్‌ను కెప్టెన్సీ నుంచే కాకుండా తుది జట్టు నుంచి తప్పించినా ఆశ్చర్యం లేదని వార్తలు వినవస్తున్నాయి.

Netizens brutally criticised Dinesh Karthik’s Captaincy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News