Friday, May 10, 2024

ఇంత చెత్త బ్యాటింగ్‌ను ఊహించలేదు: గుండప్ప విశ్వనాథ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 39 పరుగులకే ఆలౌట్ కావడం తనను ఎంతో బాధకు గురి చేసిందని మాజీ క్రికెట్ దిగ్గజం గుండప్ప విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో భారత్ ఇలాంటి చెత్త బ్యాటింగ్‌ను చేస్తుందని కలలో కూడా ఊహించలేదన్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్ కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానన్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్ సహకరిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని, అయితే హేమాహేమీ బ్యాట్స్‌మెన్‌లతో కూడిన టీమిండియా వంటి బలమైన జట్టు నుంచి ఇలాంటి స్కోరు ఊహించలేమన్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయమన్నాడు. తాము ఆడే సమయంలో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లలో దిగ్గజలాంటి ఫాస్ట్ బౌలర్లు ఉండేవారని, అయితే తాము ఎప్పుడూ కూడా ఇంత చెత్త బ్యాటింగ్‌ను చేయలేదనే విషయాన్ని గుండప్ప గుర్తు చేశాడు.

కోహ్లి, రహానె, పుజారా వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు ఉన్న భారత్ కనీసం 40 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేక పోవడం బాధాకరమన్నాడు. ఈ మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. దీన్ని ఓ పీడకల మరచిపోయి రానున్న మ్యాచుల్లో సమరోత్సాహంతో బరిలోకి దిగాలని విశ్వనాథ్ టీమిండియాను సూచించాడు.

Never thought I would See another less from India: Gundappa Viswanath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News