Thursday, May 16, 2024

క్రికెట్‌లో కొత్త నిబంధన

- Advertisement -
- Advertisement -

ముంబై : క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త రూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫుట్‌బాల్‌ను ఆటను స్ఫూర్తిగా తీసుకొని ఓ టోర్నీ నిర్వహాకులు ఈ రెడ్ కార్డ్ రూల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. విండీస్ వేదికగా జరిగే కరేబియన్ లీగ్ మ్యాచ్‌లలో ఈ రెడ్ కార్డ్ నిబంధనను అమలు చేయనున్నారు. అయితే ఫుట్‌బాల్, క్రికెట్ రెడ్ కార్డ్ నిబంధనలు పూర్తి బిన్నంగా ఉంటాయి. ఒక ఇన్నింగ్స్‌లో జట్టు వేయవలసిన ఓవర్ల కంటే వెనుకబడి ఉంటే ఆ జట్టులోని ఒక ఆటగాన్ని ఆంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ మైదానం నుంచి వనక్కు పంపిస్తారన్న మాట. అంటే 20వ ఓవర్‌లో పది మంది ఆటగాళ్లను మాత్రమే ఫీల్డింగ్‌కు అనుమతిస్తారు. టీ20 క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి ఈ రూల్‌ని ప్రవేశపెడుతున్నారు.

నిబంధనల ప్రకారం..
నిర్ణీత సమయంలోనే 20 ఓవర్ల కోటా పూర్తి చేయాలి. ఆ తర్వాత రెండో జట్టు కూడా ఇదే సమయంలో మొత్తం ఓవర్లు వేయాలి. ఇన్నింగ్స్ మొదలైన 72 నిమిషాల 15 సెకన్లలో 17వ ఓవర్ పూర్తి కావాలి. లేదంటే 18వ ఓవర్‌కు ముందు 30యార్డ్ సర్కిల్‌లో ఒక అదనపు ఫీల్డర్‌ను పెట్టాల్సి ఉంటుది. అప్పుడు సర్కిల్‌లో మొత్తం ఐదుగురు ఫీల్డర్లు అవుతారు. అలాగే 18వ ఓవర్‌ను 76 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి. అలా జరగకుంటే.. 19వ ఓవర్ వేయడానికి ముందు ఇద్దరు అదనపు ఫీల్డర్లను 30 యార్డ్ సర్కిల్‌లో ఉంచాలి. అప్పుడు సర్కిల్‌లో ఆరుగురు ఫీల్డర్లు ఉంటారు.

అంతేకాదు 19వ ఓవర్‌ను 80 నిమిషాల 45 సెకన్లలోపు వేయాలి. అలా జరుగపోతే 20వ ఓవర్‌కు ముందు ఫీల్డింగ్ జట్టు ఒక ఆటగాడిని కోల్పోవాల్సి ఉంటుంది. అయితే.. ఎవరిని గ్రౌండ్ నుంచి పంపాలనేది ఆయా కెప్టెన్లు నిర్ణయించుకోవచ్చు. అంతేకాదు ఆరుగురు ఫీల్డర్లు సర్కిల్‌లోనే ఉండాల్సి వస్తుంది. ఈ రూల్స్ తెలుసుకొని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై నెట్టింట్లో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఈనెల 16 నుంచి ప్రారంభంకానుంది. సెయింట్ లూసియా కింగ్స్, జమైకా తల్లావాస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News