Sunday, April 28, 2024

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్
రెండో బెర్త్ రేసులో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా

 New Zealand enter into Test Championship Final

దుబాయి: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా టెస్టు సిరీస్ నుంచి ఆస్ట్రేలియా వైదొలగడం కివీస్‌కు కలిసి వచ్చింది. దీంతో ఈ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. కరోనా భయంతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఆస్ట్రేలియా వైదొలిగింది. దీంతో న్యూజిలాండ్ అనూహ్యంగా ఫైనల్ బెర్త్‌ను సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 71.7 విజయశాతంతో మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 70 విజయశాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఆస్ట్రేలియా తప్పుకోవడంతో న్యూజిలాండ్‌కు సానుకూల అంశంగా మారింది. ఇతర సిరీస్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా కివీస్‌కు ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇక రెండో బెర్త్ కోసం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీ నెలకొంది. భారత్‌ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఫైనల్‌కు చేరే రెండో జట్టు ఎవరనేది తేలుతోంది. అప్పటి వరకు రెండో బెర్త్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

ఇక సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో భారత్ భారీ తేడాతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టీమిండియాకే ఫైనల్ చేరే అవకాకశాలు అధికంగా కనిపిస్తున్నాయి. టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాలంటే ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో టీమిండియా 20, 21, 30, 31 లేదా 40తో గెలవాల్సి ఉంటుంది. ఒక వేళ భారత్ 10తో గెలిచినా ఫలితం ఉండదు. అప్పుడూ ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ఇంగ్లండ్ ఫైనల్ బెర్త్ సాధించాలంటే భారత్‌పై 30, 40 లేదా 31తో గెలవాలి. అప్పుడే ఇంగ్లండ్‌కు ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఇక ఆస్ట్రేలియాకు కూడా ఫైనల్ అవకాశాలు ఇంకా మిగిలేవున్నాయి. భారత్ 10తో గెలిస్తే కంగారూలకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతోంది. ఒక వేళ ఇంగ్లండ్ 10, 20 లేదా 21తో గెలిచిన ఆస్ట్రేలియాకే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. అంతేగాక సిరీస్ 00, 11, 22తో డ్రాగా ముగిసినా కూడా ఆస్ట్రేలియాకే ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో బెర్త్ ఎవరికీ దక్కుతుందనేది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఇటు ఇంగ్లండ్ అటు భారత జట్టులో మెరుగైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. భారత్ ఫెవరేట్‌గా కనిపిస్తున్నా ఇంగ్లండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. రూట్, బట్లర్, అండర్సన్, స్టోక్స్, రోరి బర్న్, బ్రాడ్, ఆర్చర్ తదితరులతో ఇంగ్లండ్ కూడా బలంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో టెస్టు చాంపియన్‌షిప్ రెండో బెర్త్ విషయం ఆసక్తికరంగా తయారైంది.

 New Zealand enter into Test Championship Final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News