Friday, April 26, 2024

విలియమ్సన్ రెడీ కివీస్ జట్టు ఎంపిక

- Advertisement -
- Advertisement -

New zealand players ready for Team India
సౌతాంప్టన్ : ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడే న్యూజిలాండ్ జట్టును ఎంపిక చేశారు. గాయంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ విలియమ్సన్ మళ్లీ జట్టులో చేరాడు. భారత్‌తో జరిగే తుది సమరంలో జట్టు సారథ్య బాధ్యతలను విలియమ్సన్ నిర్వర్తిస్తాడు. మరోవైపు సీనియర్ బౌలర్లు టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్, ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండోమ్‌లు కూడా జట్టులో చోటు సంపాదించారు. యువ ఫాస్ట్ బౌలర్ జెమీసన్ జట్టులోకి వచ్చాడు. వాట్లింగ్, విల్ యంగ్, నికోల్స్, ఎజాజ్ పటేల్, మ్యాట్ హెన్రీలకు ఛాన్స్ ఇచ్చారు. ఊహించినట్టే యువ ఓపెనర్ డేవాన్ కాన్వే జట్టులో చోటు కాపాడుకున్నాడు. టామ్ లాథమ్, మ్యాట్ హెన్రీ, రాస్ టెలర్‌లకు కూడా ఫైనల్లో తలపడే జట్టులో చోటు దక్కింది.
జట్టు వివరాలు : విలియమ్సన్, టామ్ లాథమ్, టెలర్, డేవాన్ కాన్వే, గ్రాండోమ్, మ్యాట్ హెన్రీ, టామ్ బ్లండెల్, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, ఎజాజ్ పటేల్, టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్, వాట్లింగ్, వాగ్నర్, జెమీసన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News