Tuesday, April 30, 2024

ఉద్యోగాలు, నీళ్లడిగితే కాంగ్రెస్ దాష్టీకానికి పాల్పడింది..

- Advertisement -
- Advertisement -

Niranjan Reddy

హైదరాబాద్: ఉద్యోగాలు, నీళ్లడిగితే కాంగ్రెస్ పార్టీ దాష్టీకానికి పాల్పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ”తెలంగాణలో నెత్తురుటేరులు పారించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రాష్ట్రపతి నోటితో చెప్పి పదేళ్లు కాలయాపన చేసి బలిదానాలకు కారణమయింది కాంగ్రెస్. నేడు వారే అమరులను పరామర్శించడం హంతకులు సంతాపం తెలిపినట్లుంది. కాంగ్రెస్ ను 2014, 2019లో కేంద్రంలో, 2014, 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజలు శిక్షించినా పాఠాలు నేర్చుకోలేదు. సాగు, తాగునీరు, సంక్షేమం అభివృద్ధి తెలంగాణలో విజయవంతంగా నడుస్తుంది.. కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది?. రైతుబంధు, రైతుభీమా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు. 2017లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు పంజాబ్ లో కాంగ్రెస్ ను ప్రజలు ఈడ్చి తన్నారు.. ఏకంగా ముఖ్యమంత్రినే ఓడించారు. 2004 నుండి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయనివి 65 శాతం అని, బీజేపీ 50-56 శాతం అని అబ్దర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. తెలంగాణలో ఐటీ, పరిశ్రమలు, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మాకు అవార్డులు ఇస్తున్నది.. అవి మేం తెచ్చుకున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయండి. తెలంగాణ రాజకీయ ప్రయోగశాల కాదు. 2018లో 2 లక్షల రుణమాఫీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. టీఆర్ఎస్ ఇచ్చిన రూ. లక్ష రుణమాఫీని ఆమోదించారు. కరోనా నేపథ్యంలో రుణమాఫీ పాక్షికంగా జరిగింది.. తప్పకుండా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం. తెలంగాణ ఎవరి బిక్షమో కాదు.. మేము పోరాడి సాధించుకున్నాం. ఇయ్యనీకె మీరెవరు.. తెలంగాణను ఆంధ్రలో కలిపినప్పటి నుండి తిరిగి తెలంగాణ ఏర్పడేంత వరకు తెలంగాణది పోరాటమే. 28 రాష్ట్రాల నుండి కాంగ్రెస్ 3 రాష్ట్రాలకు కుచించుకు పోయింది. కాంగ్రెస్ ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం మూలంగా దేశంలో బీజేపీ అరాచక పాలన కొనసాగుతున్నది. ప్రస్తుత దేశ పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీనే కారణం. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ ఉంది.. కానీ కాంగ్రెస్ పుట్టుకకు ముందే స్వాతంత్ర్య పోరాటం మొదలయింది.. సిపాయిల తిరుగుబాటు నడిచింది. స్వాతంత్ర్య ఉద్యమం తమ చేతిలో ఉండాలని, హింసాత్మకం కాకూడదని ఆంగ్లేయుడు ఏఓ హ్యూమ్ చేత స్థాపించిన పార్టీ కాంగ్రెస్.. బ్రిటీష్ వాళ్లు కోరుకున్న పద్దతిలో స్వాతంత్ర్య ఉద్యమం సాగేందుకే కాంగ్రెస్ పార్టీ. జాతీయజెండాను కాంగ్రెస్ జెండాగా పెట్టుకుని కేసులు ఎదుర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వద్ద ఏ ఆధారాలున్నా రాజ్యాంగబద్ధ సంస్థలతో దర్యాప్తు చేయించుకోవచ్చు. గాలి వార్తలను ప్రజలు నమ్ముతారనుకోవడం మూర్ఖత్వం. 2019 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలుచేయడం లేదు. బీజేపీ తెచ్చిన నల్లచట్టాలకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆకాశం నుండి భూమి వరకు అన్నింట్లో స్కాములు చేసి మంత్రులు, ముఖ్యమంత్రులు జైళ్లకు పోయిన చరిత్ర కాంగ్రెస్ ది. వాళ్లు తెలంగాణ ప్రభుత్వం మీద నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదం” అని అన్నారు.

Niranjan Reddy Slams Congress leader Rahul Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News