Tuesday, April 30, 2024

మా నాన్న చేసిన అప్పు 18 ఏళ్లు వచ్చాక తీరుస్తా…గడువివ్వండి!

- Advertisement -
- Advertisement -
LIC notices to minor
తల్లిదండ్రులను కోల్పోయిన మైనర్ వినతి
స్పందించిన నిర్మలా సీతారామన్

భోపాల్‌: ‘‘కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన నేను మైనర్‌ని, ఆదాయం లేదు… నాకు 18 ఏళ్లు రాగానే మా నాన్న చేసిన అప్పు తీరుస్తా. అప్పటిదాకా గడువివ్వండి’’  అంటూ గృహరుణం వసూలు కోసం తమకు నోటీసులు పంపిన ఎల్‌ఐసీ సంస్థకు వనిషా పాఠక్‌(17) అనే బాలిక రాసిన లేఖ సారాంశం. వనిషా విజ్ఞప్తికి ఎల్‌ఐసీ స్పందించలేదు. కానీ, మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఎల్‌ఐసీ, ఆర్థిక వ్యవహారాల శాఖని ఆదేశించారు.  భోపాల్‌కు చెందిన జితేంద్ర పాఠక్‌(ఎల్‌ఐసీ ఏజెంట్‌), ఆయన భార్య గతేడాది కరోనాతో మరణించారు. దీంతో వారి సంతానం వనిషా, వివాన్‌(11) అనాథలయ్యారు. పిల్లలు మైనర్లు కావడంతో జితేంద్రకి చెల్లించాల్సిన కమీషన్‌తోపాటు ఆయన పాలసీలను ఎల్‌ఐసీ బ్లాక్‌ చేసింది. కానీ జితేంద్ర బాకీ ఉన్న రూ.29 లక్షల గృహరుణం కోసం మాత్రం నోటీసులు పంపిస్తోంది. దీంతో, మైనర్‌ను కావడంతో తండ్రి సొమ్ము విత్‌డ్రా చేయలేనని, మేజరయ్యాక అప్పు  చెల్లిస్తానని వనిషా లేఖ రాయగా.. ఎల్‌ఐసీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

బకాయిలు చెల్లించాలని లేదా ‘చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి’ అని ఆమె తన తండ్రి పేరుతో లీగల్ నోటీసులు అందుకోవడం ప్రారంభించింది. 29 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆమె ఫిబ్రవరి 2, 2022న చివరి లీగల్ నోటీసును అందుకుంది.

17  ఏళ్ల వనిషా పాఠక్ తన తల్లిదండ్రులిద్దరినీ కోవిడ్-19తో కోల్పోయిన నెలల్లోనే తన పదవ తరగతి బోర్డు పరీక్షల్లో 99.8% స్కోర్ చేసింది. ఎల్‌ఐసీ ఏజెంట్ అయిన ఆమె తండ్రి జీతేంద్ర పాఠక్ ఆఫీసు నుంచి రుణం తీసుకున్నారు. ఆయన కరోనాతో మరణించాక ఆ పిల్లలకు నోటీసులు అందుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News