Tuesday, April 30, 2024

12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనున్న ‘నివార్’

- Advertisement -
- Advertisement -

Nivar to turn into a severe storm in 12 hours

హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘నివార్’ తుఫాను పశ్చిమదిశగా ప్రయాణించి మంగళవారం ఉదయం 11.30 గంటలకు నైరుతి బంగళాఖాతంలో పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 380 కి.మీలు, చైన్నై దక్షిణ ఆగ్నేయ దిశగా 430 కి.మీలు దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా, తదుపరి 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల నేడు, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తమిళనాడు పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్, మమల్లాపురం (తమిళనాడు) మధ్య పుదుచ్చేరికి సమీపంలో నవంబర్ 25వ తేదీ సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 120 కి.మీలు నుంచి 130కి.మీలు గరిష్టంగా 145 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News