Monday, April 29, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన నిజామాబాద్ కలెక్టర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు     నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, తెలంగాణ భవన్ సెక్రెటరీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ మాట్లాడారు. ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ అర్ వి కర్ణన్ ఇచ్చిన ఛాలెంజ్ నిస్వీకరించినా నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఈ రోజు కలెక్టరెట్ లో మొక్కలు నాటడం జరిగింది. అలాగే తన వంతుగా మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నానని కామారెడ్డి జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్, అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మొక్కలు నాటాలని ట్వీట్ చేశారు.

Also Read: రాత్రి సమయంలో ఆ ఊళ్లో కరెంట్ ఆఫ్… ప్రియుడు, ప్రియురాలు ఏకాంతం కోసం

ఎంపి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ ఆవరణలో రుద్రాక్ష మొక్కను బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. సిఎం కెసిఆర్ చేపట్టిన హరితహారం, ఎంపి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పచ్చదనం పెరిగిందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News