Tuesday, April 30, 2024

మంచినీటి సరఫరాలో అంతరాయం

- Advertisement -
- Advertisement -

No drinking water for parts of Hyderabad for 36 hours

హైదరాబాద్: మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1 కోదండపూర్, నాసర్లపల్లి, గొడకండ్ల గ్రామాల వద్ద పంప్ హౌస్‌లలో 600 ఎంఎం డయా పైపులైన్‌పై వాల్వులు అమర్చడం, 300ఎమ్ డయా పైపులైన్ లీకేజీని అరికట్టడం కోసం కెడిడబ్లూస్‌పిఫేజ్-1 కోదండపూర్ నుంచి గొడకండ్ల వరకు గల పైప్‌లైన్‌కు పలు ప్రాంతాల్లో మరమ్మత్తుల వంటి తదితర పనులను జలమండలి చేపడుతుంది. నేటి ఉదయం 5 గంటల నుంచి రేపు గురువారం సాయంత్ర-ం 5 గంటల వరకు 36గంటల పాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: మిరాలం, కిషన్‌బాగ్, బాల్‌షెట్టికత్, అల్జుబైల్ కాలనీ, అలియాబాద్, హషమాబాద్, రియాసత్‌నగర్, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మాన్‌ఘడ్, దిల్‌షుక్‌నగర్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మెహబూబ్ మాన్షన్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, హిందీనగర్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివంరోడ్, చిలకలగూడ రిజర్వాయర్ ప్రాంతాలు ఉన్నట్లు, దీని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఉన్నతాధికారులు సూచించారు.

No drinking water for parts of Hyderabad for 36 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News