Monday, April 29, 2024

ఆస్ట్రేలియాదే అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్.. ఆస్ట్రేలియాదే అగ్రస్థానం

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహిస్తున్న(ఐసిసి) నిర్వహిస్తున్న టెస్టు చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 360 పాయింట్లు సాధించినా రెండో స్థానంతోనే సంతృప్తి పడాల్సి వస్తోంది. ఇక 296 పాయింట్లు మాత్రమే సాధించిన ఆస్ట్రేలియా అనూహ్యంగా మొదటి స్థానంలో నిలిచింది. 82 శాతం ఎర్నింగ్ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్ 360 పాయింట్లు సాధించినా ఎర్నింగ్ పాయింట్స్‌లో వెనుకబడడంతో రెండో స్థానానికే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రస్తుతం టీమిండియ 75 ఎర్నింగ్ పాయింట్లతో ఉంది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధించిన న్యూజిలాండ్ మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ చాంపియన్‌షిప్‌లో 300 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. అంతేగాక 63 శాతం ఎర్నింగ్ పాయింట్స్‌తో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ నాలుగో, పాకిస్థాన్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. శ్రీలంక, వెస్టిండీస్ ఆరో, ఏడో స్థానాల్లో నిలిచాయి. ఇక అగ్రశ్రేణి జట్టు దక్షిణాఫ్రికా 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ అట్టడుగు స్థానాన్ని దక్కించుకుంది.

ఇదిలావుండగా తొలి రెండు స్థానాల్లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై అందరి దృష్టి నిలిచింది. ఇందులో ఏ జట్టు విజయం సాధిస్తే దానికి అగ్రస్థానం పదిలమవుతోంది. వన్డే ప్రపంచకప్ తరహాలో టెస్టు ఫార్మాట్‌లోనూ చాంపియన్‌షిప్‌ను నిర్వహించాలనే ఉద్దేశంతో ఐసిసి ఈ టోర్నీకి శ్రీకారం చుట్టింది. ఈ చాంపియన్‌షిప్‌లో 9 జట్లు పాల్గొంటున్నాయి. రూల్స్‌లో భాగంగా ప్రతి జట్టు ఆరు జట్లతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఒక సిరీస్‌ను గెలిస్తే 120 పాయింట్లు లభిస్తాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ సమరం వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లోని చారిత్రక లార్డ్ మైదానంలో జరుగుతుంది. కాగా, కరోనా ప్రభావం ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్‌పై బాగానే పడింది. మహమ్మరి కారణంగా పలు టెస్టు సిరీస్‌లను రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసిసి కొత్త రూల్స్‌ను ప్రవేశ పెట్టింది. ఈ నిబంధనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Australia at top spot in ICC Test Championship

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News