Monday, April 29, 2024

కెనడాలో వ్యాక్సిన్ మొదటి డోసు సరఫరా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Beginning of first doses supply of vaccine in Canada

 

ఒంటారియోలో ఐదుగురు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మొదటి డోసు అందజేత

టొరంటో : కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు సరఫరా చేసిన మొదటి దేశాల జాబితాలో కెనడా చేరింది. టోరంటో ఆస్పత్రుల్లో ఒకటైన ఒంటారియోలో ఐదుగురు ఫ్రంట్‌లైన్ వర్కర్లు సోమవారం వ్యాక్సిన్ మొదటి డోసును పొందగలిగారు. ఒంటారియోలో మొదటి డోసు వ్యక్తిగత సహాయ సేవకురాలు అనితా క్విడంజెన్ మొదటి డోసు పొందగలిగారు. టొరంటోలో రెకాయి సెంటర్ నర్సింగ్‌హోమ్‌లో ఆమె పనిచేస్తున్నారు. ఇది సైన్సు విజయం సాధించిన రోజుఅని టొరంటో యూనివర్శిటీ హెల్తునెట్‌వర్క్ ప్రెసెడెంట్, సిఇఒ డాక్టర్ కెవినస్మిత్ తన అనుభూతిని వివరించారు. ఈ భయంకర వైరస్ వెన్ను విరవడానికి ఈరోజు తామిక్కడ ఉన్నామని పేర్కొన్నారు. కెనడా మొదటి విడత 30,000 డోసులు సోమవారం సరిహద్దును దాటాయి. ఫైజర్ వ్యాక్సిన్ సంస్థతో కెనడా ప్రభుత్వం ఇటీవల తన కాంట్రాక్టు కుదుర్చుకోడంతో ఈ నెల 2,49,000 డోసులు కెనడాకు రానున్నాయి.

క్యుబెక్‌లో మొదటి డోసు తీసుకున్న కెనడా ఆరోగ్యమంత్రి పట్టి హజ్డూ తనకు ఇదెంతో ఉద్వేగం కలిగిస్తోందని వెల్లడించారు. ఒంటారియోలో సోమవారం తాజాగా 1940 కేసులు నమోదు కాగా, 23 మంది మృతి చెందారు. క్యుబెక్‌లో తాజాగా 1620 కేసులు నమోదు కాగా, 25 మంది చనిపోయారు. ఆదివారం రాత్రి ఒంటారియో 6000 ఫైజర్ డోసులను పొందగలిగింది. వాటిని 2500 మంది హెల్తు వర్కర్లకు ఇవ్వనున్నారు. క్యుబెక్ లోని రెండు కేర్‌హోమ్‌ల నివాసులు వీటిని పొందుతారు. మరో ఆరు వ్యాక్సిన్ సంస్థలతో కెనడా ఒప్పందం కుదుర్చుకుంది. అవి కాక మరో మూడు సంస్థల వ్యాక్సిన్లను ప్రస్తుతం సమీక్షిస్తోంది. కావలసిన వ్యాక్సిన్ డోసుల కన్నా అత్యధికంగా డోసుల కోసం కెనడా ఆర్డరు ఇచ్చింది. కావలసిన దేశాలకు వాటిలో కొన్ని ఉదారంగా అందివ్వనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News