Saturday, April 27, 2024

సందర్శకులకు నో ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

జూరాలపై వాహనాల రాకపోకలు నిషేదం

ఎమర్జెన్సీ, మెడికల్ సర్వీస్ లకు మాత్రమే అనుమతి

Floodwater Inflow To Jurala Project Today

హైదరాబాద్: కర్ణాటకలోని ఆల్మటి, నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులకు సంబంధించిన 41 గేట్లు ఎత్తేశారు. వరద ఉదృతి ఎక్కువ కావడంతో జూరాల ప్రాజెక్టు చూడాటానికి వస్తున్న సందర్శకులకు అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు‌. అలాగే కృష్ణానదీ పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువకులు, పిల్లలను ఆనందం కోసం నదీ వద్దకు తీసుకెళ్లి సెల్పీలు దిగవద్దని హెచ్చరించారు. అత్యవసరమైతే 100 డయల్ కు పోన్ చేయాలన్నారు‌. జూరాల చూడటానికి ఎవరూ రావొద్దన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News